Save Electricity Bills : మీకు ప్రతినెలా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? నెలానెలా కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారా? అయితే, మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసా? మీ ఇంట్లో మీరు ఉపయోగించే ఎలక్టానిక్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే. సాధారణంగా ప్రతిఇంట్లో టీవీ, ఫ్రిజ్ సహా ఇతర ఎలక్ట్రానిక్స్ సర్వసాధారణం. ఏసీ, గీజర్, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఓవెన్లు వంటి అనేక అప్లయెన్సస్(Appliances) కూడా వాడుతున్నారు. వీటి వాడకం అధికంగా ఉండటం వల్ల కరెంటు బిల్లు(Power Bill) తడిసిమోపెడవుతుంది. అందుకే, కరెంట్ ఆదా(Save) విషయంలో కొన్ని విషయాలను పాటించడం ద్వారా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు.
5 స్టార్ రేటింగ్ ఎలక్ట్రానిక్స్ వాడాలి :
పాత ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా ఎక్కువకాలం వాడకూడదు. పాత ఎలక్ట్రానిక్స్ వాడకం వల్ల కరెంట్ ఎక్కువగా ఖర్చు కావడంతోపాటు పవర్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కరెంట్ ఆదా చేసే ఎలక్ట్రానిక్స్(Electronics) అందుబాటులో ఉన్నాయి. అందులో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయడం మంచిది. మీ ఫ్రfజ్ పాతది అయితే వెంటనే మార్చేయండి. దాని స్థానంలో 5 స్టార్ రేటింగ్ రిఫ్రిజిరేటర్ కొని తెచ్చుకోండి. దాంతో 40 శాతం పవర్ ఆదా చేసుకోవచ్చు. 5 స్టార్ ఏసీని కొనుగోలు చేయడం ద్వారా పవర్ బిల్లు 30 శాతం వరకు సేవింగ్ చేసుకోవచ్చు.
మీ ఇంట్లో బల్బును మార్చండి :
సంప్రదాయ(Traditional) బల్బుల కన్నా LED లైట్ బల్బులు చాలా మంచివి. ఎందుకంటే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఈ బల్బులు తక్కువగా కరెంట్ వినియోగిస్తాయి. అంతేకాదు ఎల్ఈడీ బల్బులు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి.
ఏసీ వినియోగం ఆపేయాలి :
త్వరలో సమ్మర్ వచ్చేస్తోంది. ప్రతి ఒక్కరికి ఏసీ తప్పనిసరిగా ఉండాలి. ఏసీ వాడకంతో పవర్ బిల్లు ఎక్కువగా వస్తుంది. పవర్ సేవ్ చేయాలంటే.. ఏసీని ఆన్ చేసి 24 డిగ్రీల వద్ద మాత్రమే ఉంచాలి. తద్వారా ఏసీ దానంతంట అదే స్విచ్ ఆఫ్ అవుతుంటుంది. దాంతో కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు.
ఛార్జర్, కంప్యూటర్ ఆపేయండి :
కంప్యూటర్ వర్క్ చేసిన తర్వాత పవర్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాదు.. మొబైల్ ఛార్జర్‌ను కూడా ఆన్ చేయకూడదు. ఇలా చేస్తే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. మీ స్మార్ట్ టీవీని స్టాండ్‌బై మోడ్‌లో కూడా ఉంచకూడదని గమనించాలి. అప్పుడే పవర్ ఆదా చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్ స్విచ్ ఆఫ్ చేయాలి :
ఇంట్లో లేనప్పుడు పవర్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. గదిలో ఉన్నంతవరకు అవసరమైన లైట్లను వేసుకోవచ్చు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే లైట్లు, ఎలక్ట్రానిక్స్ ఆఫ్ చేయండి. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫోన్ ఛార్జర్లు వంటి చిన్న డివైజ్‌లను పవర్ ఆన్ చేసి అలానే వదిలేయొద్దు. వినియోగంలో లేనప్పుడు పవర్ ఆన్ చేసి ఉంటే విద్యుత్ ఖర్చు అవుతూనే ఉంటుంది. ఉపయోగంలో లేనప్పుడు ఎలక్ట్రానిక్స్ ఆపివేయండి.