ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎంతగా పెరుగుతుందో దానివల్ల ఏర్పడే అనర్థాలు(Difficulties) అలాగే ఉంటున్నాయి. ఇది ఇప్పుడిప్పుడే అన్ని రంగాల(Sectors)కు చేరుకుంటున్నది. మరిన్ని నూతన ఐడియాలకు గాను ఈ సరికొత్త టెక్నాలజీని తమ ప్రొడక్ట్స్ లో భారీగా పెంచాలని చూస్తున్న ప్రముఖ సెర్చింజన్ గూగుల్(Google).. AI వల్ల కలిగే తప్పిదాలపైనా దృష్టిపెట్టింది. ఈ విషయంలో సంస్థ ఉద్యోగులను అలర్ట్ చేసింది.
ఏం జరిగిందంటే…
గూగుల్ కొత్త వైస్ ప్రెసిడెంట్(VP)గా ఈ మధ్యనే లిజ్ రీడ్ నియమితులయ్యారు. గూగుల్ సెర్చ్, ఇతర ప్రొడక్ట్స్ లో తప్పుల్ని(Mistakes) ఆమె గుర్తించారు. కొత్త ఫీచర్ల కోసం రిస్క్ చేయాల్సిందేనని ఉద్యోగులకు చెప్పిన ఆమె, వాటి వల్ల ఎదురవుతున్న అనర్థాల్ని కూడా గుర్తించాలని స్పష్టం చేశారు. ‘మేం రిస్క్ తీసుకోవాలి.. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా నడవాల్సిందే.. ఏదైనా సమస్య గుర్తిస్తే మరింత పరిశీలనగా చూసి పరిష్కారం దిశగా సాగాలి..’ అని అన్నారంటూ CNBC రిపోర్ట్ తెలిపింది.
అయినా…
సమస్యల్ని గుర్తిస్తున్నా తమ ప్రొడక్ట్స్ లో AIని మరింతగా పెంచాలని లిజ్ రీడ్ అంటున్నారు. AI ఓవర్ వ్యూ టూల్ ద్వారా డజను వరకు టెక్నికల్ ఇంప్రూవ్ మెంట్స్(Improvements) ఉండేలా చూస్తున్నారు. కంపెనీకి చెందిన జెమిని చాట్ బాట్, ఇమేజ్ జనరేషన్ టూల్ పనితీరు పట్ల కస్టమర్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను పరిగణలోకి తీసుకుని వాటిని సరిచేసే పనిపై దృష్టిపెట్టింది. ప్రాబ్లమ్స్ అంటూ కస్టమర్ల నుంచి వస్తున్న ప్రతిదాన్నీ పట్టించుకోవద్దన్న లిజ్.. అందులో చాలా విషయాలు ఫేక్ అని గుర్తుంచుకోవాల్సిన అవవరముందన్నారు.