గూగుల్.. ఇప్పుడీ పదం ఇంటింటికీ కామన్(Common) అయిపోయింది. ఇంట్లో కంప్యూటర్ లేదా చేతిలో ఫోన్ ఉంటే చాలు.. గూగుల్ అవసరం ఏంటో అర్థమవుతుంది. అంతలా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం(Domination) సాధిస్తున్న గూగుల్(Google).. పలు రకాలుగా అందరికీ అందుబాటులో ఉంది. మరి ఒక్క నెలలోనే ఎంతమంది గూగుల్ ను వాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు.
ఆరు రకాలుగా…
సెర్చ్(Search), ఆండ్రాయిడ్(Android), మ్యాప్(Map), క్రోమ్(Chrome).. ఇలా 6 ప్రధాన ప్రొడక్ట్ లను అందిస్తున్నది గూగుల్. ఈ ఆరు ప్రొడక్ట్ లను ప్రపంచవ్యాప్తంగా నెలకు 2 బిలియన్ల(200 కోట్ల) యాక్టివ్ యూజర్స్ వాడుతున్నారట. ఇక 3 బిలియన్ల మంది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని మరింత విస్తరించాక ప్రపంచంలో యూజర్లను ఆకట్టుకునేలా గూగుల్ దూసుకుపోతున్నదని పిచాయ్ తెలిపారు.
100కు పైగా దేశాల్లో…
గూగుల్ ప్రస్తుతం 100 దేశాలకు పైగా యూజర్లకు సేవలందిస్తున్నది. తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించింది. పిక్సెల్, ఫొటోస్, క్రోమ్, మెసేజ్ సహా వివిధ రంగాల్లో AIని మరింతగా ప్రవేశపెట్టి భారీస్థాయిలో యూజర్లను పెంచుకోవాలన్న ఆలోచనతో ఉంది. యూట్యూబ్, క్లౌడ్ వల్ల భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరంతో పోలిస్తే 15% వృద్ధితో 80.5 బిలియన్ డాలర్లు(రూ.7.20 లక్షల కోట్లు) సంపాదించింది.