HD Quality Images on WhatsApp : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజ్ వాట్సాప్ అత్యంత సాధారణ యాప్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. వాట్సాప్ సాయంతో ఫొటోలు, వీడియోలు(Videos), వాయిస్ నోట్, కాంటాక్ట్‌లు, లొకేషన్‌తో పాటు డాక్యుమెంట్లను పంపుకోవచ్చు. స్నేహితులు, ఇతర కాంటాక్టులతో షేర్ చేయొచ్చు. అయినప్పటికీ, మెటా యాజమాన్యంలోని యాప్ ఇమేజ్‌లను కంప్రెస్ చేస్తుంది. అందువల్ల చాలా మంది వినియోగదారులు హై-క్వాలిటీ ఫొటోలను ట్రాన్స్ ఫర్ చేయడానికి ఇతర పద్ధతులను ఎంచుకుంటారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ ఇప్పుడు చాట్ల ద్వారా HD ఫొటోలను షేర్(Share) చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్(Facebook) పోస్ట్‌లో ప్రకటించారు. మెటా హెడ్ పోస్ట్‌లో ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. మీరు HD ఫొటోను యాడ్ చేసిన తర్వాత చాట్ థ్రెడ్‌లో చూపిన HD ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఈ ఫీచర్‌ను గత జూన్‌లో బీటా ఛానెల్లో తొలిసారిగా టెస్టింగ్ చేశారు. ప్రస్తుతం అందరికీ ఈ ఫీచర్(Feature) అందుబాటులో ఉంది. HD ఫొటోలు నాన్హెచ్డి ఇమేజ్‌లతో పోలిస్తే.. ఎక్కువ డేటా స్టోరేజ్‌ని వినియోగిస్తాయని కూడా గమనించాలి.
వాట్సాప్‌లో చాట్లలో HD ఫొటోలను ఎలా పంపాలి?
మీ ఫోన్లో WhatsApp ఓపెన్ చేసి ఏదైనా చాట్ థ్రెడ్‌ని ఎంచుకోండి.
దిగువన ఉంచిన ఆప్షన్ల నుంచి అటాచ్మెంట్ ఐకాన్ (Android)లో పేపర్క్లిప్, iOS కోసం ‘+’)పై క్లిక్ చేయండి.
మీరు షేరింగ్ చేయాలనుకుంటున్న ఫొటోను ఎంచుకోండి.
మీకు ఎగువన ఒక HD ఐకాన్ కనిపిస్తుంది. రొటేట్ లేదా క్రాప్ వంటి ఇతర ఆప్షన్ల పక్కన కనిపిస్తుంది.
హై క్వాలిటీ ఫొటోల కోసం HD బటన్‌పై క్లిక్ చేసి, Send నొక్కండి.
వాట్సాప్‌లో అన్ని ఫొటోలు డీ-ఫాల్ట్‌గా ప్రామాణిక క్వాలిటీ(Quality)తో పంపుతారు. ఫైల్ సైజును తగ్గించడానికి యాప్ ఇమేజ్‌ని కంప్రెస్ చేస్తుంది. అయితే, మీరు HD ఫొటోను ఎంచుకోవాలనుకుంటే.. మీరు HD ఐకాన్‌పై మాన్యువల్‌గా నొక్కాలి. రిసీవర్ కోసం HD ఐకాన్ ఫొటో దిగువన ఎడమ వైపున కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే సరిపోతుంది.
Published 05 Feb 2024