లోక సభ స్పీకర్ పదవి(Post)కి అధికార, విపక్షాలు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. ఏకగ్రీవం చేసుకుందామని NDA అడిగితే మేమే బరిలో ఉంటాం అంటూ అభ్యర్థి(Candidate)ని I.N.D.I.A. కూటమి రంగంలోకి దింపింది. దీంతో దేశ చరిత్రలో మరోసారి దిగువసభాపతి(Loksabha Chief) ఎన్నికకు రంగం సిద్ధమైంది. దేశ చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది మూడోసారి. 18 లోక్ సభలకు గాను పదిహేనింట్లో ఏకగ్రీవ ఎన్నికలే జరిగాయి.
మూడోసారి…
సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇస్తేనే అధికార పక్షానికి సహకరిస్తామని(Support) కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయంపై ఖర్గేతో రాజ్ నాథ్ చర్చిస్తారని చెప్పినా, ఆయన్ను చర్చలకు పిలవలేదని రాహుల్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ ను ఖరారు చేయకుండా మద్దతు ఇవ్వాలనడం ఇండియా కూటమిని అవమానించడమేనని రాహుల్ విమర్శించారు. తమ అభ్యర్థిగా కె.సురేశ్ తో నామినేషన్ వేయించారు.
ఎమర్జెన్సీ తర్వాత…
స్వతంత్ర భారతంలో తొలి ఎన్నికల(1952) సభలో స్పీకర్ ఎన్నిక జరిగింది. జి.వి.మౌలాంకర్, శంకర్ శాంతారామ్ పోటీ పడితే.. మౌలాంకర్ కు 394, శాంతారామ్ కు 55 ఓట్లు వచ్చాయి. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ టైంలోనూ ఎలక్షన్ నిర్వహించారు. 1976లో బలిరామ్ భగత్, జగన్నాథ్ రావు పోటీ పడితే బలిరామ్ కు 344, జగన్నాథ్ కు 58 ఓట్లు వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత 48 ఏళ్లకు ఇప్పుడు మూడోసారి ఎన్నిక జరగబోతున్నది.