దుబాయి(Dubai)లో బంగారం ధరలు తక్కువ. అందుకే దాన్ని ‘బంగారు నగరం’ అంటారు. 24 క్యారెట్ల స్వర్ణం ధర ప్రస్తుతం రూ.85,000-88,000 మధ్య ఉంది. భారత్ కన్నా 8-9% తక్కువ కావడంతో బంగారం తేవాలనుకుంటారు. అయితే రవాణా చేయాలంటే ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC)’ రూల్స్ పాటించాలి. అక్కణ్నుంచి పుత్తడి తేవాలంటే 6% సుంకం చెల్లించాలి. దుబాయిలో 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించేవారు CBIC రూల్స్ ప్రకారం కిలో వరకు తేవచ్చు. https://justpostnews.com
టాక్స్ లేకుండా పురుషులు రూ.50 వేలు, మహిళలు రూ.లక్ష విలువ వరకు తీసుకురావచ్చు. 15 ఏళ్ల లోపు పిల్లలకు 40 గ్రా. పరిమితి ఉంది. ఇవి ఆభరణాలకే కాగా.. కడ్డీలు, నాణేలకు కాదు. పరిమితికి మించి అంటే 20-50 గ్రా.కు 3%, 50-100 గ్రా.కు 6%, 100 గ్రా.కు పైగా ఉంటే 10% పన్ను చెల్లించాలి. కన్నడ నటి రన్యారావు 14.2 కేజీలతో పట్టుబడటంతో.. బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న ఆమెకు రూ.102 కోట్లు పెనాల్టీ పడింది.