
Published 26 Jan 2024
మీ UPI పిన్ ఎలా మార్చాలో తెలియదా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం…
How to change your UPI PIN… Check These Step by Step
మీ యూపీఐ పిన్ మార్చుకోవాలని అనుకుంటున్నారా? యూపీఐ పిన్ ఎలా మార్చుకోవాలో తెలియదా? యూపీఐ పేమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూపీఐ లావాదేవీలు చేసేటప్పుడు పిన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఏదైనా లావాదేవీ(Transaction) చేసేందుకు వీలుంటుంది. అలాంటి యూపీఐ పిన్ ఏంటి అనేది ఇతరులకు ఎప్పుడూ చెప్పకూడదు. అలా అని అందరికి కనిపించేలా UPI పిన్ పెట్టుకోకూడదు. లేదంటే.. మీ యూపీఐ పిన్ ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు అకౌంట్లో(Account) నగదును నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే యూపీఐ పిన్ ఎవరికి చెప్పకూడదు.
సాధారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్. యూపీఐ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) ఉపయోగించి పేమెంట్లు చేయడానికి అనుమతిస్తుంది. మీ యూపీఐ లావాదేవీలను సురక్షితంగా ఉంచడానికి బలమైన యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోవాలి. అంతేకాదు.. యూపీఐ పిన్ క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యం. మీ డిజిటల్ లావాదేవీల భద్రతను నిర్ధారించడంలో యూపీఐ పిన్ని మార్చడం ఒక కీలకమైన దశగా చెప్పవచ్చు. మీరు ఏదైనా అనధికారిక యాక్సెస్‌ను అనుమానించినా లేదా భద్రతా కారణాల దృష్ట్యా మీ పిన్ అప్డేట్ చేయాలనుకుంటే ఈ కింది విధంగా ప్రయత్నించండి.
యూపీఐ పిన్ మార్చుకునే ముందు ఈ టిప్స్ పాటించండి :
ఇతరులు సులభంగా గుర్తించలేని బలమైన యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోవాలి.
మీ యూపీఐ పిన్ని ఎవరితోనూ షేర్ చేయవద్దు.
యూపీఐ పిన్ క్రమం తప్పకుండా మార్చుతుండాలి.
యూపీఐ పిన్ను మరచిపోయినట్లయితే.. యూపీఐ యాప్‌లోని సూచనలను అనుసరించడం ద్వారా రీసెట్ చేయవచ్చు.
మీ యూపీఐ పిన్ను ఎలా మార్చాలనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ స్మార్ట్‌ఫోన్‌లో UPI యాప్‌ను ఓపెన్ చేయండి. Google Pay, PhonePe, Paytm లేదా ఏదైనా ఇతర బ్యాంక్-నిర్దిష్ట UPI యాప్ కావచ్చు.
మీ వివరాలను ఉపయోగించి మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి. ఇందులో మీ UPI ID, మొబైల్ నంబర్ లేదా ఏవైనా ఇతర వివరాలు ఉండవచ్చు.
లాగిన్ అయిన తర్వాత UPI సర్వీసులు లేదా సెట్టింగ్స్ విభాగానికి వెళ్లండి. సాధారణంగా ప్రధాన మెనూలో లేదా యాప్‌లో ప్రత్యేక ఎంపికగా ఉంటుంది.
UPI సర్వీసుల మెనులో ‘UPI PINని మార్చండి’ లేదా ‘UPI PINని రీసెట్ చేయండి’ ఆప్షన్ కోసం చూడండి.
మీ ప్రస్తుత UPI PIN ఎంటర్ చేయమని ప్రాంప్ట్ మెసేజ్ కనిపిస్తుంది.
ప్రస్తుత UPI PIN ఎంటర్ చేసిన తర్వాత మీ కొత్త UPI పిన్ని సెట్ చేయమని అడుగుతుంది. స్ట్రాంగ్ అండ్ సేఫ్ పిన్ని క్రియేట్ చేసుకోవాలి.
నిర్ధారించడానికి కొత్త యూపీఐ పిన్ని మళ్లీ ఎంటర్ చేయండి.
మీరు కొత్త పిన్ ఎంటర్ చేసి నిర్ధారించిన తర్వాత submit చేయండి.
మీ యూపీఐ పిన్ విజయవంతంగా మారినట్టు సూచించే మెసేజ్ అందుకుంటారు.
వినియోగదారులు యూపీఐ పేమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న విధంగా యూపీఐ పిన్ తరచు(Regular)గా మార్చుతుండాలి. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే యూపీఐ పిన్ మార్చడం చాలా ముఖ్యం.