New PVC Aadhaar card online : భారతీయ పౌరులకు ఆధార్ కార్డ్ ముఖ్యమైన గుర్తింపు పత్రం. ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను పొందేందుకు డిజిటల్ గుర్తింపు రుజువుగా ఉపయోగించవచ్చు. ఆధార్ కోల్పోతే సేవలను పొందేందుకు ఎవరైనా ఆధార్ కాపీని షేర్ చేయాలి లేదా ఆన్లైన్లో స్కాన్ చేయాలి. అయితే, ఆధార్ జారీ చేసే సంస్థ UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా), కార్డ్ హోల్డర్లు పొగొట్టుకున్న ఆధార్‌ను ఆన్లైన్ ఆఫ్‌లైన్‌లో తిరిగి పొందేందుకు అనుమతిస్తుంది.
eAadhaar ఎలా పొందాలంటే? :
ఆధార్ నంబర్ తెలిసిన వ్యక్తులు తమ ఇ-ఆధార్‌ను నేరుగా UIDAI వెబ్సైట్ లేదా mAadhaar యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ పాస్వర్డ్-ప్రొటెక్టెడ్ ఎలక్ట్రానిక్ కాపీతో UIDAI ద్వారా డిజిటల్ సైన్ చేసి ఉంటుంది. ఫిజికల్ కాపీ వంటి అన్ని ప్రయోజనాలకు ఇది చెల్లుబాటు అవుతుంది.
Google Play Store లేదా Apple App Store నుంచి mAadhaar యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్, బయోమెట్రిక్‌లతో సైన్ ఇన్ చేయండి.
“my aadhaar”పై క్లిక్ చేయండి.
“Download Aadhaar” వద్ద e-Aadhaar”పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన 4-అంకెల OTP ఎంటర్ చేయాలి.
OTPని ఎంటర్ చేసి “Submit”పై క్లిక్ చేయండి.
మీ ఇ-ఆధార్ PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది.
భవిష్యత్ ఉపయోగం కోసం ఈ PDF ఫైల్‌ను సేవ్ చేసుకోండి.
PVC ఆధార్ కార్డ్ ఎలా ఆర్డర్ చేయాలంటే? :
ఆధార్ కార్డును ఆన్లైన్లో PVC కార్డ్‌గా మార్చుకోవడానికి UIDAI అనుమతిస్తుంది. మీరు UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి రూ.50 రుసుము చెల్లించి పొందవచ్చు. ఈ PVC కార్డ్ ఉపయోగించిన ప్లాస్టిక్.. అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటుంది. ప్రామాణిక మార్కెట్ ప్లాస్టిక్ కార్డ్‌లతో పోలిస్తే.. మీ ఆధార్‌కు మెరుగైన రక్షణను అందిస్తుంది.
UIDAI వెబ్సైట్ https://uidai.gov.in కి వెళ్లండి.
“my aadhaar” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
“Order Aadhaar PVC Car” ఆప్షన్ వద్ద “Order Now”పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్, captcha ఎంటర్ చేయండి.
“Proceed”పై క్లిక్ చేయండి.
మీ అడ్రస్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
“Submit”పై క్లిక్ చేయండి.
మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసి “Verify”పై క్లిక్ చేయండి.
రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
“Pay Now”పై క్లిక్ చేయండి.
మీరు వెరిఫై అయినట్లుగా నిర్ధారణ మెసేజ్ వస్తుంది.
మీ PVC ఆధార్ కార్డ్ 15 పనిదినాలలో మీ చిరునామాకు డెలివరీ అవుతుంది.
Published 01 Feb 2024