ఎలక్ట్రానిక్ ఉత్పుత్తుల్లో భారీ ముందడుగు సాధించేలా భారతదేశం గొప్ప కార్యాచరణను ప్రకటించింది. ప్రపంచం(World)లోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంతో సాగుతున్న భారత్.. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ లో ప్రపంచ దేశాల్ని తలదన్నేలా ఉండాలని నిర్ణయించింది. రానున్న అతి కొద్ది సంవత్సరాల్లో మన దేశం నుంచి 300 బిలియన్ డాలర్ల(రూ.25.5 లక్షల కోట్లు) విలువైన ఉత్పత్తుల్ని(Production) తయారు చేయబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఉత్పత్తులు, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.
పర్యావరణ ఉత్పత్తులపై…
100 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ని ఎగుమతుల కోసం తయారు చేస్తున్నామని, ఇందుకోసం మోదీ సర్కారు ప్రత్యేక పాలసీ(Policy)ని అమలు చేస్తున్నదన్నారు. పర్యావరణంతో కూడిన ప్రొడక్షన్ పై స్వయం సమృద్ధి సాధించేలా తయారీ రంగం ఊపందుకుంటున్నదని, ఈ విషయంలో భారత్ లో అపార అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అధునాతన(Moderanisation) ప్రాజెక్టులపై ప్రధాని మోదీ దృష్టి సారించారని గుర్తు చేశారు.
రైల్వే రంగంపైనే…
రైల్వే రంగంపై తమ ప్రభుత్వ హయాంలో 40 బిలియన్ డాలర్లు(రూ.3.4 లక్షల కోట్లు) వెచ్చించి సరికొత్త ప్రాజెక్టుల్ని అమలు చేశామని, గత ప్రభుత్వ పాలన అయిన 2004-2014లో ఇది కేవలం 2 బిలియన్ డాలర్లు(రూ.17,000 కోట్లు) మాత్రమేనని తెలిపారు. గతంలో రోజుకు 4 కిలోమీటర్ల మేర ట్రాక్ లు నిర్మించారని, కానీ ఇప్పుడది నిత్యం 15 కిలోమీటర్లకు చేరుకుందన్నారు. 5జీ నెట్వర్క్ విషయంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ విధానాల్ని పాటిస్తున్నామని, టెలీకమ్యూనికేషన్ పరికరాల(Equipment)ను భారీ యెత్తున విదేశాలకు ఎగుమతి చేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Published 11 Feb 2024