
మహిళల ప్రపంచకప్(World Cup)లో భారత్ సంచలన విజయం సాధించింది. సెమీస్ లో ఆసీస్ పై ఘనంగా గెలిచింది. తొలుత ఆస్ట్రేలియా 338కి ఆలౌటైతే, తర్వాత భారత్ దుమ్మురేపింది. జెమీమా(127 నాటౌట్; 134 బంతుల్లో 14×4), హర్మన్(89) జోడీ మూడో వికెట్ కు 167 పరుగులు చేసింది. కంగారూలను కంగారు పెట్టిన ఈ జంట.. చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఓవర్ కు మొదట్నుంచీ 6 రన్ రేట్ కు పైగానే సాగింది. షెఫాలి(10), మంధన(24) వెంటవెంటనే ఔటవగా.. 59కే రెండు కీలక వికెట్లు చేజారాయి. అయితే కీలక దశలో హర్మన్ సైతం వికెట్ పారేసుకోవడంతో బాధ్యతంతా రోడ్రిగ్స్ పై పడింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో నవంబరు 2న భారత్ తలపడనుంది.