భారత టెస్టు క్రికెట్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్మెంట్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, శుభ్ మన్ గిల్, కె.ఎల్.రాహుల్, రిషభ్ పంత్ పోటీలో ఉన్నా.. గిల్ కు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) కోసం జట్టులో మరిన్ని మార్పులు జరగబోతున్నాయి. 25 ఏళ్ల 241 రోజుల గిల్.. IPLలో గుజరాత్ టైటాన్స్ ను పాయింట్ల పట్టికలో నంబర్ వన్ చేశాడు. కెప్టెన్సీతోపాటు వ్యక్తిగతంగా రాణిస్తూ 612 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 32 టెస్టుల్లో 5 సెంచరీలతో 1,893.. 55 వన్డేల్లో 8 శతకాలతో 2,775.. 21 టీ20ల్లో ఒక సెంచరీతో 578 పరుగులు చేశాడు.