ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీయే వినపడుతోంది. భవిష్యత్తులో దీని వల్ల ఉద్యోగాలు ఉండవన్న భయం ఏర్పడింది. కానీ అదంతా తప్పు అంటున్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు(Co-Founder) నందన్ నీలేకని. ‘మానవ మేధకు AI ఏ మాత్రం సరిపోదు.. ప్రపంచంలో అన్ని రకాల AI ఉంది.. కానీ ఓ ఐదుగురు టీం సభ్యుల ఆలోచనల్ని అది చేయలేదు.. కల్పనాశక్తి(Empathy), నాయకత్వం, సహకారం, సృజనాత్మకతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు.. డబ్బును నియంత్రించడంలోనూ AI పని శూన్యం..’ అని నందన్ నీలేకని స్పష్టం చేశారు.