Published 21 Jan 2024
మీరు ట్విట్టర్(‘X’) అకౌంట్ వాడుతున్నారా? అయితే మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఒకటి వచ్చేసింది. మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఈ ఫీచర్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రత్యేకించి ప్రీమియం ఎక్స్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్(Twitter ‘X’ New Feature) ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు యాప్ నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్లు చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా పొందాలంటే.. మీరు చేయాల్సిందిల్లా.. మీ ‘ఎక్స్’ యాప్ అప్డేట్ చేసుకోవడమే. యాప్ అప్డేట్ అయిన వెంటనే ఈజీగా కొత్త ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ప్రీమియం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం.
కొత్త ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే..?
ఆడియో, వీడియో కాలింగ్ చేసుకోవాలన్నా లేదా ఫీచర్ ఎనేబుల్ చేయలన్నా ముందుగా వినియోగదారులు తమ యాప్‌లోని సెట్టింగ్స్(Settings)కి వెళ్లాలి. ఆపై (Privacy and Security) ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. తద్వారా డైరెక్ట్ మెసేజెస్ అనే ఆప్షన్‌కు నావిగేట్ చేయవచ్చు. ఈ సెట్టింగ్‌లలో వినియోగదారులకు మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ‘మీకు ఎవరు కాల్ చేయవచ్చు, ఎవరు ఫాలోవర్లు, వెరిఫైడ్ యూజర్లు‘ అనేవి ఉంటాయి. ఈ ఆప్షన్ల నుంచి మల్టీ ఆప్షన్లను ఎంచుకునే సౌలభ్యాన్ని వినియోగదారులు పొందవచ్చు. ఈ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అనుభవాన్ని, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి దీన్ని తీసుకొచ్చింది.
త్వరలో iOS యూజర్లకు అందుబాటులో…:
ట్విట్టర్(‘X’)ను కొనుగోలు చేసినప్పటినుంచి దాని అధినేత ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేస్తున్నారు. అప్పటినుంచి సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే.. త్వరలో iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు యాప్ నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్ల ద్వారా కనెక్ట్ అయ్యేలా చేయడమే దీని లక్ష్యం.
నెలకు లేదా సంవత్సరానికి…:
ఈ నెల ప్రారంభంలో వెరిఫైడ్ సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్రాథమిక చెల్లింపు స్థాయిని ‘X’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నెలకు 200 డాలర్లు(రూ.17,000) లేదా సంవత్సరానికి 2 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టైర్ గోల్డ్ చెక్-మార్క్ బ్యాడ్జ్, అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. ‘ఎక్స్’ ప్లాట్‌ఫారమ్‌లో వేగవంతమైన వృద్ధిని చందాదారుల యాడ్స్ క్రెడిట్లను పొందేలా చిన్న వ్యాపారాల కోసం రూపొందించింది.