భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గగన్ యాన్ ప్రయోగం డిసెంబరులో ఉంటుందని ఛైర్మన్ సోమనాథ్ అధికారికంగా వెల్లడించారు. శ్రీహరికోటలో ఈరోజు ప్రయోగించిన SSLV(స్మాల్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్) విజయవంతమైన తర్వాత గగన్ యాన్ గురించి క్లారిటీ ఇచ్చారు.
G1గా పిలుచుకునే ఈ తొలి దశ యాత్రను మానవరహితంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి వైరింగ్, టెస్టింగ్ పనులు జరుగుతున్నాయని.. నవంబరుకల్లా మొత్తం వ్యవస్థను సిద్ధం చేస్తామన్నారు. SSLV సక్సెస్ తర్వాత ‘లో ఎర్త్ ఆర్బిట్(LEO)’లోనూ మరిన్ని కమర్షియల్ ప్రయోగాలు నిర్వహించేందుకు ద్వారాలు తెరిచినట్లయిందన్నారు.