నైసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లే GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(SHAR) నుంచి ప్రయోగించారు. భూమిపై అన్ని ప్రాంతాలను 12 రోజులకోసారి నైసార్ పరిశీలిస్తుంది. పుడమిని 24 గంటల పాటు స్కాన్ చేస్తూ పంటలు, మంచు విస్తీర్ణం గురించి అధ్యయనం చేస్తుంది. 97 నిమిషాలకోసారి భూమిని చుట్టిరానున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా కలిసి రూ.11,200 కోట్లతో తయారు చేశాయి. అనుకున్నట్లుగానే 18:59 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయి అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శాస్త్రవేత్తలంతా సంతోషం పంచుకున్నారు.