రోజూ 8 గంటల పని.. వారానికి ఐదు రోజులు డ్యూటీ.. శని, ఆదివారాలు(Weekends) రెస్ట్… కానీ అనఫీషియల్ గా 12 గంటలకు పైగా పనిచేసే ఐటీ ఉద్యోగులకు కర్ణాటకలో పెద్ద షాక్ తగిలే ప్రమాదముంది. రోజుకు 14 గంటల పనివేళల్ని అమలు చేయాలన్న వివాదాస్పద ప్రతిపాదన(Proposal) అక్కడి కంపెనీల నుంచి వచ్చింది.
ఇది అమానవీయమంటూ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిత్యం 12 గంటలతోపాటు 2 గంటల ఓవర్ టైమ్ కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1961ను కాంగ్రెస్ సర్కారు అమలు చేయబోతుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుత రూల్స్ ప్రకారం రోజుకు 12 గంటలు(10+2 గంటల ఓవర్ టైమ్) మాత్రమే అనుమతించొచ్చు.
ఇప్పటికే కన్నడిగులకు ప్రత్యేక రిజర్వేషన్లు ప్రకటించి మరీ వెనక్కు తీసుకున్న సిద్ధరామయ్య సర్కారు అభాసు(Blame)పాలైంది. మరి ఐటీ కంపెనీల తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.