భారీగా లాభాలు(Profits) పొందుతున్నా జీతాలు పెంచకపోవడం, ఉద్యోగుల్ని తొలగించడం వంటివి చేస్తుంటాయి చాలా కంపెనీలు. అయితే కోయంబత్తూరుకు చెందిన కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్ల బోనస్ ప్రకటించింది. ఇప్పటికే చాలా మందికి బోనస్ ను ఖాతాల్లో వేసింది. కోవై.కో(Kovai.co) అనే యూకే బేస్డ్ కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. 2022, డిసెంబరు 31కి ముందు చేరి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ ఏడాది జీతంలో 50 శాతాన్ని బోనస్ ఇచ్చింది. ఈ కంపెనీ మూడు ప్రొడక్టులపై సేవలు అందిస్తుంటుంది.
2023 యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ 16.5 మిలియన్ డాలర్లు(రూ.140.25 కోట్లు)గా ఉంది. కోవై.కో కంపెనీ ఈ మధ్యే బెంగళూరు బేస్డ్ సంస్థ ఫ్లోయిక్(Floik)ను కొనుగోలు చేసింది. మొత్తం 260 మంది సిబ్బందికి గాను తొలిదశలో 80 మంది బోనస్ అందుకున్నారు. కంపెనీ వృద్ధి, లాభాలకు ఉద్యోగులే కారణమని నమ్మినందునే ఆ సంపదను వారితో పంచుకుంటున్నానని CEO, వ్యవస్థాపకుడు శరవణకుమార్ అంటున్నారు.