‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ జరిపిన దాడిలో జైషే చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కుటుంబం హతమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఇన్నిరోజులకు తెలియజేశాడు. మసూద్ కుటుంబ సభ్యుల దేహాలు(Bodies) ముక్కలు ముక్కలయ్యాయంటూ ఒక మీటింగ్ లో ఆవేశంగా ప్రసంగించాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా కనపడని ఇలియాస్.. ఆకస్మిక వీడియోతో దర్శనమిచ్చాడు. మే 7న భారత్ దాడితో భావల్పూర్ లోని మసూద్ డెన్ అయిన సుభానల్లా నేలకూలింది.
