Lenovo Transparent Laptop : గ్లోబల్ మార్కెట్లోకి కొత్త ట్రాన్స్పరెంట్ ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది. ఇటీవలే లెనోవో (Lenovo) భారత మార్కెట్లో (Legion 9i) ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. అమెరికాలో థింక్‌బుక్ ప్లస్ జెన్ 5 హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. రాబోయే రోజుల్లో కంపెనీ.. ప్రస్తుతం ఉన్న అనేక ల్యాప్‌టాప్ మోడళ్లను రిఫ్రెష్ చేసేందుకు రెడీ అవుతోంది. బార్సిలోనాలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(MWC) 2024లో కొత్త ల్యాప్‌టాప్ మోడళ్లను ఆవిష్కరించనుందని భావిస్తున్నారు. అయితే అప్గ్రేడ్లతో పాటు, కంపెనీ సరికొత్త పారదర్శక డిజైన్‌తో కొత్త ల్యాప్‌టాప్ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్టు సమాచారం.
MWC 2024 ఈవెంట్లో ప్రదర్శించే ఛాన్స్ :
లెనోవో పారదర్శక ల్యాప్‌టాప్ డిజైన్ రెండర్లను విండోస్ రిపోర్ట్ లీక్ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న (MWC 2024)లో కంపెనీ ఈ ట్రాన్స్పరంట్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించవచ్చని పేర్కొంది. రిపోర్టులోని ఫొటోలను పరిశీలిస్తే.. లెనోవో బ్రాండింగ్(Branding)తో కొత్త ల్యాప్‌టాప్ మోడల్ వస్తుందని చూపుతున్నాయి. ఒక బెజిల్-లెస్ డిజైన్, ఆకర్షణీయమైన డిస్ప్లే మాదిరిగా కనిపిస్తుంది.
ఈ పారదర్శక లెనోవో ల్యాప్‌టాప్ డెక్ రిప్లెక్టివ్గానూ పూర్తి పారదర్శకంగా కూడా ఉంటుంది. ఇందులోని ప్రాథమిక అంతర్గత భాగాలు(Internal Parts) బయటకు కనిపించవు. వీటిలో స్లిమ్ ఫ్రేమ్ కూడా ఉంది. మొత్తం డెక్కి బార్డర్ ఎడ్జ్ మాదిరిగా ఉంటుంది. మల్టీ కనెక్టివిటీ పోర్ట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ :
సదరు రిపోర్టులో ట్రాన్స్పరెంట్ లెనోవో ల్యాప్‌టాప్ ఎలాంటి స్పెసిఫికేషన్లను పేర్కొనలేదు. కానీ Windows 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుందని సూచించింది. మోడల్ క్లాసిక్ కన్నా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌లను పోలి ఉంటుందని పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్‌ను MWC 2024లో ఆవిష్కరించినప్పుడు కంపెనీ కొన్ని ఫీచర్లు. స్పెసిఫికేషన్లను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరెన్నో ల్యాప్‌టాప్ మోడల్స్ అప్‌గ్రేడ్ :
లెనోవో థింక్‌బుక్ 14 G4, లెనోవో ThinkPad T14 Gen 5 (ఇంటెల్, AMD వెర్షన్లు), లెనోవో ThinkPad T16 Gen 3, లెనోవో ThinkPad x12 డిటాచబుల్ Gen 2, లెనోవో ThinkVision M14Tని అప్‌గ్రేడ్ చేసేందుకు కంపెనీ రెడీగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
Published 11 Feb 2024