ఇప్పటివరకు మంచుకొండల్లో బరువైన యుద్ధ ట్యాంకులు వాడేవారు. టీ-72, టీ-90 వంటి ట్యాంకులకు భిన్నంగా అత్యంత ఎత్తైన కొండల్లోనూ సులువుగా సంచరించేలా అధునాతన(Modern) యుద్ధ ట్యాంకుల్ని త్వరలోనే భారత సైన్యంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ‘జొరావర్(Zoravar)’ యుద్ధ ట్యాంకును చైనాలోని ప్రాంతాలే టార్గెట్ గా DRDO-లార్సన్ అండ్ టూబ్రో జాయింట్ గా తయారు చేస్తున్నాయి.
ప్రత్యేకతలివే…
మరో 2 లేదా రెండున్నరేళ్లలోపు చేతికి రానున్న ‘జొరావర్’.. టీ-72, టీ-90 కన్నా ఈజీగా కొండల్ని ఎక్కడం, నదుల్ని దాటడం చేస్తుంటుంది. సాధారణంగా యుద్ధ ట్యాంకుల్లో భారీ, మధ్య, లైట్ తరహావి 3 రకాలంటాయి. దేని ప్రత్యేకత దానిదే కాగా.. భారీ, మధ్యతరహా ట్యాంకులు చేసే పనుల్ని సైతం అత్యంత సులువుగా ‘జొరావర్’ చేస్తుందని DRDO చీఫ్ డా. సమీర్ వి.కామత్ తెలిపారు.
ఆ పేరెలా…
లద్దాఖ్, పశ్చిమ టిబెట్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో కీలకంగా పనిచేసే ‘జొరావర్’కు.. 19వ శతాబ్దంలో డోగ్రా జనరల్ గా పనిచేసిన జొరావర్ సింగ్ పేరును పెట్టారు. ఫైర్ పవర్, ప్రొటెక్షన్, సర్వైలెన్స్ వల్ల ఎక్కణ్నుంచైనా, ఎంత వేగంగానైనా ఆయుధాల్ని పేల్చవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ, మోడ్రనైజేషన్ ద్వారా చైనాకు దీటుగా తన దిశల్ని మార్చుకుంటూ సాగిపోతుందీ యుద్ధ ట్యాంక్. ఇది మిగతా ట్యాంకుల్లో సగం అంటే 25 టన్నుల బరువు మాత్రమే ఉండేలా డిజైన్ చేశారు. మొత్తం 354 ట్యాంకులకు గాను ఫస్ట్ ఫేజ్ లో 59 వెహికిల్స్ అప్పగిస్తారు.