ఒకరోజు తిండి లేకున్నా బతికేయొచ్చు కానీ వాట్సాప్(Whats App), ఫేస్బుక్ లేకుండా బతకలేరు అన్నది ప్రస్తుత మాట. అంతలా జీవితాల్లోకి చొచ్చుకెళ్లిన ఈ మాధ్యమాల అవసరం ఎంతున్నా దేశాల సంప్రదాయాల మేరకు నడచుకోవాల్సిందే. అలా జరగకపోతే ఏమవుతుందో బ్రెజిల్ ను చూస్తే తెలుస్తుంది.
బ్యాన్…
పర్సనల్ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కు జనరేట్ చేయాలని మెటా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మెసేంజర్(Messenger), ఫేస్బుక్, వాట్సాప్ లో మార్పులపై ప్రైవసీ పాలసీ తీసుకువచ్చింది. దీన్ని బ్రెజిల్ కు చెందిన ANPD(నేషనల్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ) అడ్డుకుంది. దాన్ని హోల్డ్ లో పెట్టడంతోపాటు ప్రైవసీ పాలసీని సస్పెండ్ చేసింది.
ఎందుకిలా…
ఈ సస్పెండ్ వల్ల పర్సనల్ డేటాను AIకి అనుసంధానించే విషయంలో యూజర్లు ఉండబోరన్నమాట. దీనికి పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాల(Imminent Risk)కు దారితీసే ఛాన్స్ ఉందన్నది ANPD వాదన. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బ్రెజిల్ సర్కారు భావించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
బాధలో మెటా…
బ్రెజిల్ తీసుకున్న నిర్ణయంపై మెటా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవసీ పాలసీ ఆమోదిస్తే ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా నిలిచేదని, ఈ అవకాశాన్ని బ్రెజిల్ ప్రజలు కోల్పోయారని చెప్పింది. అటు మెటాపై యూరోపియన్ యూనియన్(EU) సైతం గుర్రుగా ఉంది. డిజిటల్ చట్టాలను ఉల్లంఘిస్తున్న మెటాపై భారీ జరిమానా వేయబోయేలా ఉంది.
ఈ మధ్య భారత్ లోనూ ఇలాంటి ఇష్యూ జరిగింది. కేంద్ర IT 2021 రూల్స్ ప్రకారం ఛాటింగ్స్ ట్రేస్ చేయడం, మెసేజ్ లు పంపిన అసలైన(Original) వ్యక్తుల్ని గుర్తించడానికి వాట్సాప్ సహకరించాలి. ఈ రూల్ ను కోర్టులో సవాల్ చేసిన మెటా.. అవసరమైతే మూసేసుకుంటాం తప్ప రాజీపడబోమని తేల్చి చెప్పింది. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 400 మిలియన్ల(40 కోట్లు) యూజర్లున్నారు.