ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్(Pakistan)ను మైక్రోసాఫ్ట్ భారీ దెబ్బ కొట్టింది. 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆ సంస్థ.. దేశం నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు తగ్గిస్తూ వచ్చిన సంస్థ.. ఇప్పుడు ఏకంగా వైదొలిగింది. 2000 జూన్లో అక్కడ అడుగుపెట్టిన మైక్రోసాఫ్ట్(Microsoft).. కంపెనీ తీసేస్తున్నట్లు ఉద్యోగులకు సమాచారమిచ్చింది. ఒక శకం ముగిసింది అంటూ పాక్ లోని మైక్రోసాఫ్ట్ చీఫ్ జవ్వాద్ రహమాన్ ప్రకటించారు. ప్రపంచ దేశాల ఆర్థిక సాయంతో నెట్టుకొస్తున్న దాయాది దేశం.. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల నిర్ణయంతో ఉన్న ఆదాయాన్ని కోల్పోతోంది.