విమానాలతో మిసైళ్లను ప్రయోగించడం చూస్తుంటాం… కానీ డ్రోన్లతోనే వాటిని ప్రయోగిస్తే… దాన్నే నిజం చేసి చూపించారు భారత శాస్త్రవేత్తలు. UAV లాంచ్డ్ ప్రీసిషన్ గైడెడ్ మిసైల్(ULPGM)-V3ని DRDO సైంటిస్టులు AP కర్నూలులో విజయవంతంగా ప్రయోగించారు. తక్కువ ఖర్చు, వేగంగా లక్ష్యాల్ని చేరుకోవడం కోసం డ్రోన్లను వాడతారు. ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ గరిష్ఠంగా 4 కిలోమీటర్ల పరిధితో ఉంటాయి. ఆకాశం నుంచి భూమిపై లక్ష్యాలను ఛేదించగలదు. పగలు, రాత్రి వేళల్లో గమ్యాన్ని చేరుకోనుండగా, ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ కెమెరాతో కటిక చీకట్లోనూ లక్ష్యాన్ని అందుకుంటుంది. పగటిపూట నాలుగు, రాత్రివేళ 2.5 కి.మీ. రేంజ్ ను చేరుకుంటుంది. స్థిరంగా ఉన్న లేదా కదులుతున్న లక్ష్యాలను ఛేదించగలదు. https://justpostnews.com