మీరు ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పేలే కనిపిస్తాయి. ఏ చిన్న షాప్ కు వెళ్లినా, రోడ్లపై బండ్ల మీదా ఈ రెండు కంపెనీల క్యూఆర్(QR) కోడ్ లే కనిపిస్తాయి. మరి దేశంలో ఈ రెండు కంపెనీలే ఇందుకోసం పర్మిషన్ తీసుకున్నాయా… అంటే కాదనే చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్ తో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో గుత్తాధిపత్యానికి చెక్ పడనుందా…!
ఫోన్ పే(PhonePe), గూగుల్ పే(GooglePay) ఆధిపత్యానికి అడ్డుకట్ట పడబోతున్నదా…!
ఈ రెండింటికి మరిన్ని కంపెనీలు తోడవుతాయా…
అంటే అవుననే జవాబే వస్తున్నది. దేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపు(Digital Transactions)ల్లో 86 శాతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారానే నడుస్తున్నాయి. అందుకే ఈ గుత్తాధిపత్యాని(Monopoly)కి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. డిజిటల్ లావాదేవీల్లో ఒంటెద్దుపోకడలు మరీ ఎక్కువవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వార్నింగ్ ఇచ్చిన వేళ… నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) రంగంలోకి దిగింది.
పేటీఎం రద్దుతో…
దిగ్గజ సంస్థ అయిన పేటీఎం(Paytm)పై RBI ఆంక్షలతో వేటు పడ్డ వేళ ఫోన్ పే, గూగుల్ పే సంస్థలు ఆధిపత్యం దిశగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండింటికి చెక్ పెట్టాలని RBI హెచ్చరించింది. దేశీయంగా ఈ రెండు కంపెనీలే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని, వాటికి చెక్ పెట్టేందుకు(Restrict) మరిన్ని సంస్థలకు రంగంలోకి దింపాలని NPCI ఆలోచన చేసింది. UPI లావాదేవీలు జరిపేందుకు కొన్ని కంపెనీలతో మీటింగ్ కూడా నిర్వహించబోతున్నది.
ఈ కంపెనీలతో…
ఫ్లిప్ కార్ట్(Flipkart), జొమాటో(Zomato), క్రెడ్(Cred), అమెజాన్(Amazon) ఇతర ఫిన్ టెక్ కంపెనీలతో NPCI భేటీ కానుంది. అయితే ఈ సమావేశానికి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంకు మాత్రం ఆహ్వానం అందించలేదు. మొత్తం జరిగే UPI లావాదేవీల మీద ఒక థర్డ్ పార్టీ యాప్(App)నకు 30 శాతానికి మించిన వాటా ఉండరాదన్నది NPCI నిబంధన. అందుకే ఈ పరిమాణాని(Quantity)కి మంచి ట్రాన్జాక్షన్స్ జరుపుతున్న రెండు సంస్థలకు త్వరలోనే అడ్డుకట్ట పడబోతున్నది. దీంతో భారీగా లావాదేవీలు జరుపుతున్న ఫోన్ పే, గూగుల్ పేపై చర్యలకు రంగం సిద్ధం చేసింది NPCI.