Published 25 Jan 2024
ట్రూకాలర్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ఫోన్లలో ఇదే కనిపిస్తుంటుంది. కాలర్ ఐడీ, స్పామ్-బ్లాకింగ్ యాప్‌గా ట్రూకాలర్(Truecaller) పేరు పొందింది. మెసేజింగ్, కాల్లు, ఫ్లాష్ మెసేజ్‌లు, యూపీఐ మనీ ట్రాన్స్ఫర్లు కూడా చేసుకోవచ్చు. అంతేకాదు.. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్‌లను గుర్తించడంతోపాటు వాటిని బ్లాక్ చేయడంలో ఈ ట్రూకాలర్ యాప్ సాయపడుతుంది. అలాగే స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. గుర్తుతెలియని నంబర్ల గురించి అవసరమైన వివరాలను కూడా అందిస్తుంది.
అదేవిధంగా మీ ట్రూకాలర్ యాప్‌లో పేరు తప్పుగా గుర్తించినట్లయితే.. చింతించాల్సిన అవసరం లేదు. మీరు దానిని సులభంగా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు పాత నెంబర్ వాడి పడేసినవారి పేరే ట్రూకాలర్ లో కనిపిస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో మీ పేరుతో అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే ట్రూకాలర్ ఉపయోగిస్తుంటే.. ఈ ప్రక్రియ చాలా సులభం. ఇంకా యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోని వారు ముందుగా మీ పేరు ఎడిట్ చేసుకోవచ్చు. ట్రూకాలర్ యాప్‌లో కనిపించే మీ పేరును అప్డేట్ చేయాలనుకుంటే ఈ కింది సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి.
ఆండ్రాయిడ్ (Android) యూజర్ల కోసం :
ట్రూకాలర్ (Truecaller) యాప్‌ని ఓపెన్ చేయండి.
టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ గుర్తించండి.
ఎడిట్ (Edit) మెనూలో ‘Edit Profile’ ఆప్షన్ నొక్కండి.
మీ కొత్త పేరును ఇక్కడ ఎడిట్ చేయండి. కొత్త మార్పులతో Save చేయండి.
చివరిగా ‘Phone Settings > Apps > Truecaller > Cache Clear’ ఆప్షన్ ఎంచుకోండి.
ఆపిల్ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం :
ట్రూకాలర్ (Truecaller) యాప్‌ను ఓపెన్ చేయండి.
టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది చూడండి.
ఎడిట్ (Edit) మెనూని ఎంటర్ చేయడానికి ‘Edit Profile’ నొక్కండి.
మీ పేరును కచ్చితమైన దానికి ఎడిట్ చేయండి. కొత్త మార్పులతో Save చేయండి.
ట్రూకాలర్ యూజర్ కాలేదా? మీ పేరును ఎలా మార్చుకోవాలంటే?
ట్రూకాలర్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీ ఫోన్ నంబర్ కోసం సెర్చ్ చేయండి.
మరింత కచ్చితమైన ఐడెంటిటీ కోసం ‘Suggest better name‘పై క్లిక్ చేయండి.
ట్రూకాలర్ ఆటోమాటిక్‌గా సరైన పేరును ఒకటి లేదా రెండు రోజుల్లో అప్డేట్ చేస్తుంది.
మీరు ఇటీవల మీ ట్రూ కాలర్ ప్రొఫైల్‌లో మార్పులు చేసి ఉంటే.. అది అప్డేట్ అయ్యేందుకు 24 గంటల నుంచి 48 గంటలు పట్టవచ్చని గమనించడం ముఖ్యం. అదనంగా, మీ ఫోన్ పాత డేటాను స్థానికంగా కలిగి ఉన్నట్లయితే.. యాప్‌లోని సెర్చ్ ఎంట్రీని క్లియర్ చేయడం మర్చిపోవద్దు.