చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం(Space Day)గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించడంతో నేడు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 2023 జులై 14న బయల్దేరిన ల్యాండర్, రోవర్ ఆగస్టు 23న జాబిల్లిపై కాలుపెట్టాయి. అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులు, యువతలో ఆసక్తి పెంచేందుకు గాను పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సర్కారు సూచించింది.
ఈ ఏడాది థీమ్ గా ‘టచింగ్ లివ్స్ వైల్ టచింగ్ ద మూన్(Touching Lives While Touching The Moon)’ అంతరిక్ష సాగా అంటూ రూపొందించారు. జాబిల్లిపై కలను నెరవేర్చుకున్న ఇస్రో.. ఇక ‘గగన్ యాన్’ యాత్రకు సిద్ధమైంది. ఈ డిసెంబరులోనే అందుకు సంబంధించిన యాత్ర మొదలవుతుందంటూ ఈ మధ్యనే ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు.