సోషల్ మీడియాపై విధించిన నిషేధం నేపాల్ లో ఆందోళనలకు దారితీసింది. రాజధాని ఖాట్మండు(Kathmandu) వీధులు యువకుల నినాదాలతో మార్మోగాయి. పార్లమెంటు వైపు దూసుకుపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరో 42 మంది గాయపడ్డట్లు అక్కడి న్యూస్ ఏజన్సీలు తెలిపాయి. ‘ఫేస్ బుక్’, ‘X’, యూట్యూబ్ సహా 26 ప్లాట్ ఫాంలను బ్లాక్ చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ ఈ నెల 6న ప్రకటించారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం లైజనింగ్ కార్యాలయాలుండాలన్న నోటీసుల్ని పట్టించుకోకపోవడంతో నిషేధం పడింది.