Published 22 Jan 2024
రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధన వనరులకు భిన్నంగా పర్యావరణహిత(Environmentally Friendly) వాహనాలు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారులకు ప్రోత్సహకాలు అందిస్తున్నది. మొన్నటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లంటేనే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు జనంలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ తరహా స్కూటర్లదే హవా అని అనిపిస్తున్న వేళ.. మార్కెట్లోకి కొత్త కొత్త డిజైన్లు, వినూత్న(Variety) ఫీచర్లతో వెహికిల్స్ వస్తున్నాయి. అందులో భాగంగా రూపుదిద్దుకుంటున్నదే ఈ కొత్త స్కూటర్. దాని విశేషాలేంటో చూద్దాం…
Also Read: రూ.20 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే…
పక్కా ‘ఫ్యామిలీ స్కూటర్’
Ather Energy Rizta Electric Scooter: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. లాంచ్‌కు ముందుగానే కంపెనీ.. ఈవీ స్కూటర్ పేరు, డిజైన్ ను రివీల్ చేసింది. కొత్త మోడల్ ఈవీ స్కూటర్ పేరును ‘రిజ్టా’గా వెల్లడించింది. ఇది ఫ్యామిలీ స్కూటర్ అని చెబుతోంది. త్వరలో(Soon) రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి గతంలో బెంగళూరులో టెస్టింగ్ నిర్వహించినట్టు కంపెనీ తెలిపింది. 2024లో జరిగే కమ్యూనిటీ డే వేడుకల సందర్భంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ.. ఈ కొత్త ఈవీ రిజ్టా స్కూటర్‌ను ఆవిష్కరించనుంది. ఈ ఫ్యామిలీ స్కూటర్‌కు ‘డీజిల్’ అని పేరు పెట్టడంపై ఆన్లైన్లో పుకార్లు షికార్లు చేశాయి.
Also Read: ట్విట్టర్(‘X’)లో ఇంట్రెస్టింగ్ ఫీచర్…
లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే? :
అయితే దీనిపై కంపెనీ సీఈఓ(Chief Excutive Officer) తరుణ్ మెహతా(Tarun Mehta) సోషల్ మీడియా వేదికగా విషయాన్ని పంచుకున్నారు. ఈ ఫ్యామిలీ స్కూటర్ కు డీజిల్ పేరు అని జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్.. డీజిల్ కింద అభివృద్ధి చేసిన స్కూటర్ అనే పేరు ఉండబోదని తెలిపారు. రాబోయే స్కూటర్‌కి అధికారిక పేరు ‘ఏథర్ రిజ్టా’ అని మాత్రమే ఉంటుందని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఆరు నెలల్లో లేదా ఈ సంవత్సరం చివరిలో లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను కూడా కంపెనీ షేర్ చేసింది. రిజ్టా స్కూటర్ సైడ్ ప్యానెల్‌లపై కట్లతో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుత ఏథర్ రిజ్టా… 450 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌కు భిన్నంగా ఉండనుంది. ఏరోడైనమిక్-అధునాతన డిజైన్ కలిగి ఉండనుంది.
Also Read: యూట్యూబ్ యూజర్లలో ‘టాప్’ లేపుతున్న భారత్…
డిజైన్, స్పెషిఫికేషన్లు అదుర్స్ :
ఇంకా, ఎల్ఈడీ హెడ్‌లైట్ ఫ్రంట్ ప్యానెల్లో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అదే విధంగా ఫార్మాట్ చేసిన టెయిల్‌లైట్‌తో రానుంది. ప్రస్తుత 450X మోడల్‌తో పోలిస్తే.. రాబోయే ఏథర్ రిజ్టా మరింత విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ కలిగి ఉండనుంది. అన్ని స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలను తయారీదారు రివీల్ చేయలేదు. అయినప్పటికీ, రిజ్టా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. 7.0-అంగుళాల డీప్‌వ్యూ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంటేషన్(LCD Instrumentation)ను కూడా కలిగి ఉండనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే మరి..
Also Read: శాంసంగ్ ఫోన్ల మజాకా… భలే ఉన్నాయిగా ఫీచర్లు…