ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే తడిసి మోపెడవుతుంది.. ఇప్పుడేం తీసుకుంటాంలే అనుకునేవాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. EVలపై ఇప్పటికే సబ్సిడీలు అందిస్తుండగా, అతి త్వరలోనే వాటి ధరలు పెట్రోలు కార్లతో సమానంగా ఉండబోతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఇది సాకారం కాబోతుందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మేకిన్ ఇండియా, కాలుష్య నియంత్రణ(Pollution Control)నే ప్రభుత్వ విధానాలన్నారు. అందుకే EVల వాడకాన్ని పెంచుతున్నామని, కాబట్టి పెట్రోలు ధరల్లోనే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంధన దిగుమతుల తగ్గింపు.. పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వాడకమే లక్ష్యాలన్నారు. ఇలాంటి పద్ధతుల్లో వెహికిల్స్ తయారు చేయాలంటూ ఆటోమొబైల్ కంపెనీలకు గడ్కరీ సూచించారు.