Safer Security Feature : ప్రస్తుత కాలంలో ఆన్లైన్(Online) మోసాలు(Frauds) పెరిగిపోతున్నాయి. ఓటీపీ(OTP) ఆధారిత మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మొబైల్ వన్-టైమ్-పాస్వర్డ్ ఫీచర్‌కు త్వరలో స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటీపీ ఫీచర్ స్థానాన్ని సరికొత్త టెక్నాలజీతో భర్తీ చేయాలని భారత రిజర్వ్ బ్యాంకు(RBI) భావిస్తోంది. తద్వారా భారత మార్కెట్లో డిజిటల్ స్కామ్‌లతో ఎదురయ్యే అతిపెద్ద సవాలును ఎదుర్కోవచ్చు.
డిజిటల్ పేమెంట్లలో అథెంటికేషన్ కోసం ఓటీపీలు కీలకంగా మారాయి. ప్రజలను మోసగించడానికి, వారి డబ్బును దొంగిలించడానికి స్కామర్లు ఈ ఓటీపీ టూల్ ఉపయోగిస్తుంటారు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)… ఈ ఓటీపీ సెక్యూరిటీ ఫీచర్ తొలగించాలని భావిస్తోంది. ఓటీపీకి బదులుగా అన్ని స్మార్ట్ఫోన్లలోని అథెంటికేషన్(Authentication) యాప్‌లు లేదా బయోమెట్రిక్ సెన్సార్ వంటి లేటెస్ట్ సేఫ్ టూల్స్ ఉపయోగించుకోవచ్చు.
కొత్త సెక్యూరిటీ లేయర్ ఫుల్ సేఫ్ :
SMS-ఆధారిత OTP లావాదేవీలను తొలగించాలనే నిర్ణయం సిమ్ మార్పిడి లేదా వివరాల కోసం డివైజ్‌లను హ్యాక్ చేసే ప్రమాదాన్ని నిరాకరిస్తుంది. ఇతర అథెంటికేషన్ మార్గాల్లో జరిగే చెల్లింపులపై కూడా వినియోగదారులు మెరుగైన నియంత్రణను కలిగి ఉంటారు. హ్యాకర్లు ఇలాంటి సెక్యూరిటీ లేయర్‌ను హ్యాక్(Hack) చేయడం కష్టంగా భావిస్తారు. ఓటీపీలు భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ట్విట్టర్(X) ప్లాట్‌ఫామ్ లో SMS-ఆధారిత ధృవీకరణ ప్రక్రియను తొలగించి వినియోగదారులు తమ ఖాతాలోకి లాగిన్ చేయడానికి అథెంటికేషన్ యాప్‌లను ఎంచుకోవలసిందిగా ఒత్తిడి చేసింది.
ఓటీపీ స్కామ్‌లకు చెక్ :
ఈ రోజుల్లో ఓటీపీ సెక్యూరిటీ ఫీచర్లు ఇతర ప్రమాణాల కన్నా భద్రత తక్కువగా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పద్ధతికి సంబంధించి అనేక ఓటీపీ స్కామ్(Scams)లు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి, వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో యూపీఐ చెల్లింపులు చేయడానికి మీరు ఈ ప్రత్యేక నంబర్లను ఎలా ఉపయోగిస్తారో అలాగే (MPIN) కోసం కూడా బ్యాంకింగ్ అథారిటీ పరిగణించవచ్చు. ఓటీపీ నుంచి ఈ యాప్‌లకు మారడం అనేది ఎకోసిస్టమ్‌లో భారీ మార్పును సూచిస్తుంది.
కానీ, ఇప్పటికీ ఇలాంటి యాప్‌లకు సపోర్ట్ లేని ఫీచర్ ఫోన్లను ఉపయోగించే యూజర్లు అతిపెద్ద సవాలును ఎదుర్కొంటారు. ఆర్బీఐ ఈ పాయింట్ల ద్వారా నావిగేట్ చేయాలి. యూజర్ల డివైజ్‌ల్లో యాప్‌లకు యాక్సెస్ ఉన్నవారికే కాకుండా ప్రతి ఒక్కరికీ ఈ సర్వీసు అందించేలా పరిష్కారాన్ని అందించాలి. కొత్త సెక్యూరిటీ లేయర్ ఎప్పుడు? ఏ రూపంలో యాడ్ చేయనుంది వంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.