సర్వీసుల్ని లేటెస్ట్ టెక్నాలజీతో మరింత సులభతరం చేసేలా కేంద్రం చేపట్టిన ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు ‘పాన్ కార్డ్ 2.0’. అప్డేషన్(Updation), కరెక్షన్, అలాట్మెంట్(Allotment) వంటి సేవల్ని ఒక్కటి చేసేదే ‘పాన్ 2.0’. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు వేగంగా వెరిఫై చేసుకునే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా దక్కుతుంది. పాన్, వాటి అనుబంధ సేవల్ని ప్రస్తుతం వివిధ విభాగాలు చూస్తున్నాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ఐటీ, ITSL పోర్టల్ ను UTI, ఈ-గవర్నెన్స్ పోర్టల్ ను ప్రొటీన్ పర్యవేక్షిస్తున్నాయి. అయితే కొత్త సిస్టంలో పాన్, టాన్ సంబంధిత సేవల్ని ఏకీకృతం చేసేలా ఒకే సంస్థ చూసుకుంటుంది. ప్రస్తుతం పాన్ UTIలో అప్లై చేసుకుంటే.. కార్డ్ రీ-ప్రింటింగ్, కరెక్షన్ వంటివి సంస్థ వెబ్సైట్ కు వెళ్లే చేయాలి. కానీ ఇప్పుడా వ్యవస్థకు ఫుల్ స్టాప్ పడుతుంది.
అయితే చాలా మందిలో ఒక అనుమానం ఉంది. ‘పాన్ 2.0’తో ఇక పాత కార్డులు పనికిరావా అన్న సందేహం ఉంది. పాత కార్డు అలాగే ఉంటుందని, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏవైనా మార్పులు, అప్డేట్స్ ఉంటేనే 2.0 కింద అప్లయ్ చేసుకుని కొత్త కార్డు తీసుకోవచ్చు. నూతన విధానంలోనూ పాత కార్డులు, వాటి నంబర్లు పనిచేస్తాయని తెలిపింది. పాత వాటి మాదిరిగానే కొత్తదాంట్లోనూ QR కోడ్ ఉండగా, ఇందులో వేగంగా డేటా ప్రాసెస్ అయ్యేలా డైనమిక్ వ్యవస్థ ఉంటుంది. స్కాన్ చేయగానే పేరు, సంతకం, ఫొటో, పుట్టినతేదీ వివరాలన్నీ తేలిగ్గా తెలిసిపోగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇది సులువు కానుంది.