Paytm FASTag De-Activate : పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ వాడుతున్నారా? పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిషేధం విధించడంతో అనేక మంది పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ యూజర్లలో గందరగోళం(Confusion) నెలకొంది. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ వాడకంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు తమ ట్యాగ్‌లను అధీకృత బ్యాంకుల నుంచి పొందాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హెచ్చరిక జారీ చేసింది.
దాంతో పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు తమ Paytm FASTag అకౌంట్లను డీ-ఆక్టివేట్ చేయడం లేదా ప్రత్యామ్నాయ బ్యాంకులకు మారిపోవడం తప్పనిసరిగా మారింది. ముందుగా పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను డీ-ఆక్టివేట్ చేయడం లేదా ఇతర బ్యాంకులకు పోర్ట్ చేసుకోవడం మాత్రమే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పేటీఎంతో FASTagని డీయాక్టివేట్ చేసుకోవాలంటే? :
* పేటీఎం లింక్ చేసిన మీ FASTag అకౌంట్ డీయాక్టివేట్ చేసుకోండి.
* మీ యూజర్ ఐడీ, వ్యాలెట్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఫాస్ట్ ట్యాగ్ పేటీఎం పోర్టల్‌కి లాగిన్ చేయండి.
* లాగిన్ తర్వాత ధృవీకరణకు మీ ఫాస్ట్‌ట్యాగ్ నంబర్, రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
* ఇప్పుడు, ‘Help & Support’ సెక్షన్ కనుగొనడానికి కిందికి స్క్రోల్ చేయండి.
* ‘ఫాస్ట్‌ట్యాగ్ ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకోండి’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
* ఆ తర్వాత ‘I Want to Close My FASTag’ ఆప్షన్ ఎంచుకోండి
ఫాస్ట్‌ట్యాగ్‌ని మరొక బ్యాంకుకు పోర్ట్ చేసుకోవచ్చు :
మరో బ్యాంకుదారునికి మీ ఫాస్ట్ ట్యాగ్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే నేరుగా బదిలీ చేయడం సరైన ఆప్షన్ కాదని గమనించడం ముఖ్యం. బదులుగా, వాహన యజమానులు పోర్టింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి HDFC లేదా ICICI బ్యాంక్ వంటి ఇతర FASTag జారీ చేసేవారిని సంప్రదించాలి. మీ వాహనం రిజిస్ట్రేషన్ సమాచారంతో సహా అన్ని అవసరమైన వివరాల(Details)ను మార్చుకోవాలి. మీ నిర్ణయాన్ని గురించి కొత్త ఫాస్ట్ ట్యాగ్ జారీదారుకి తెలియజేయండి. మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌ను కొత్త జారీదారు నుంచి తదుపరి సూచనలను అనుసరించండి. ఫాస్ట్ ట్యాగ్ డీ-ఆక్టివేషన్ చేయడం లేదా పోర్టింగ్ ద్వారా అంతరాయం లేకుండా ఫాస్ట్‌ట్యాగ్ సర్వీసులను కొనసాగించవచ్చు.