పేటీఎం(Paytm) బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఆర్బీఐ(Reserve Bank Of India) ఆంక్షలు విధించడంతో దాని సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అయితే ఇప్పటివరకు ఉన్న Paytm కస్టమర్లను ఇతర బ్యాంకులకు ట్రాన్స్ ఫర్ చేసే విధానం ప్రారంభమైంది. UPI చెల్లింపుల కోసం వినియోగదారుల్ని కొత్త బ్యాంకులకు తరలించేందుకు(Shifting).. Paytm పేరెంట్ కంపెనీ అయిన ‘వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(OCL)’కు NPCI అనుమతినిచ్చింది.
థర్డ్ పార్టీ ప్రొవైడర్ గా…
మల్టీ బ్యాంక్ మోడల్ లో థర్డ్ పార్టీ(Third Party) అప్లికేషన్ ప్రొవైడర్ గా ‘వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(OCL)’ పనిచేసేందుకు 2024 మార్చి 14న NPCI ఆమోదించింది. దీంతో Paytm భాగస్వామ్య బ్యాంకుల ద్వారా UPI సేవలు కొనసాగుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), యాక్సిస్ బ్యాంక్, HDFC, YES బ్యాంక్ లతో లావాదేవీలు కొనసాగించవచ్చు. కస్టమర్ల అకౌంట్లను ఈ నాలుగు బ్యాంకులకు మార్చడానికి తాము అనుమతించినట్లు స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ లో Paytm స్పష్టం చేసింది.
ఛేంజ్ ఐడీ…
ఇపుడున్న Paytm UPI ఐడీ సైతం ఆటోమేటిక్ గా మారుతుంది. Paytm కస్టమర్లు సదరు నాలుగు బ్యాంకుల్లోని ఏదో ఒక బ్యాంకుతో టై అప్ అయిన తర్వాత ‘@Paytm’తో ఉన్న ప్రస్తుత ఐడీ మారిపోతుంది. మార్చుకున్న బ్యాంక్ అకౌంట్ కు అనుగుణంగా కొత్త UPI ఐడీ ద్వారా ట్రాన్జాక్షన్స్ జరపాల్సి ఉంటుంది. Paytm కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు(Disturbances) కలగకుండా ఆటో పే మ్యాండేట్ల యాక్సెస్ ను కొనసాగించేలా చర్యలు చేపట్టింది. దీంతో కొత్త బ్యాంకులకు బదిలీ అయిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని Paytm తెలిపింది.