PM Surya Ghar : ఉచిత విద్యుత్ కోసం అప్లయ్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే అప్లయ్ చేసుకోండి. సామాన్య పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కోటి గృహాల(House)కు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free Power)ను అందించడమే లక్ష్యంగా పీఎం సూర్య ఘర్.. మఫ్ట్ బిజిలీ యోజన ప్రారంభించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూ.76 వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా తక్కువ విద్యుత్ బిల్లులు, ప్రజలకు ఉపాధి కల్పనకు సాయం అందిస్తుంది.
రూఫ్ టాప్ సోలార్ పవర్ స్కీమ్ కింద నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్(Union Cabinet) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
సోలార్ ప్యానెల్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పీఎం సూర్య ఘర్.. మఫ్ట్ బిజిలీ యోజన కింద రూఫ్‌టాప్(Roof Top) సోలార్ ప్యానెల్(Solar Panel) కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఈ కింది వాటితో పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
* మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి
* మీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఎంచుకోండి
* మీ విద్యుత్ వినియోగదారు సంఖ్యను ఎంటర్ చేయండి
* మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి
* ఇమెయిల్‌ని ఎంటర్ చేయండి
దయచేసి పోర్టల్(Portal) నుంచి సూచనల ప్రకారం అనుసరించండి :
* వినియోగదారు నంబర్ & మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి.
* ఫారమ్ ప్రకారం.. రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి.
* DISCOM నుంచి ఆమోదం కోసం వేచి ఉండండి.
* ఆమోదం పొందిన తర్వాత మీ డిస్కమ్‌లో నమోదిత విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేయండి.
* ఇన్స్టలేషన్(Installation) పూర్తయిన తర్వాత ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
* నెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేసి డిస్కం ద్వారా చెక్ చేసిన తర్వాత పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు.
* మీరు కమీషనింగ్ రిపోర్టు ఒకసారి పొందండి.
* పోర్టల్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సిల్డ్ చెక్కును సమర్పించండి.
* మీరు 30 రోజుల్లోగా మీ బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీని అందుకుంటారు.