సూర్యుడి కరోనాలోని రహస్యాల్ని శోధించేందుకు ప్రయోగించిన PSLV C-59 ప్రయోగం విజయవంతమైంది. వాతావరణం అనుకూలించపోవడంతో నిన్న జరగాల్సిన పరీక్ష ఈరోజు నిర్వహించగా.. దాన్ని సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన రాకెట్ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం పంచుకున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ప్రోబా-3లోని ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ISRO ప్రవేశపెట్టింది. ఈ విజయంతో సూర్యుడిపై ప్రయోగాలకు మరింత ఉత్సాహం వచ్చిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. డిసెంబరులో స్పేటెక్స్ పేరుతో PSLV C-60 ప్రయోగం ద్వారా సదరు ఉపగ్రహంతో ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ నిర్వహిస్తామన్నారు.