
హనుమజ్జయంతి వేళ ‘రామాయణ’ టీజర్ విడుదలైంది. రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ తొలి గ్లింప్స్ ‘రామ’ పేరుతో వచ్చాయి. అభిమానులు జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగించారు. ‘రాముడు సర్వకాలీనుడు.. కోరికల కన్నా కర్తవ్యానికి.. స్వార్థం కన్నా త్యాగానికే ప్రాధాన్యతనిచ్చాడు.. మానవాళిని శక్తివంతం చేస్తూ సంఘర్షణల్ని పరిష్కరించి శాంతిని సమకూర్చే నమ్మకం కలిగిస్తూనే ఉంది..’ అనే క్యాప్షన్ తో ఆన్లైన్ లో టీజర్ విడుదలైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.