విరాట్ కోహ్లి(67; 42 బంతుల్లో), రజత్ పటీదార్(64; 32 బంతుల్లో) ఫటాఫట్ ఇన్నింగ్స్ తో బెంగళూరు(RCB) భారీ స్కోరు చేసింది. ముంబయి(MI)పై మొదట్నుంచీ ఆ జట్టు 10కి పైగా రన్ రేట్ కొనసాగించింది. సాల్ట్(4) ఆడకున్నా పడిక్కల్(37) సహకరించాడు. కోహ్లికి పటీదార్ జత కావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. విరాట్ 29 బంతుల్లో, పటీదార్ 25 బాల్స్ లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. చివర్లో జితేశ్ శర్మ(40; 19 బంతుల్లో) దాడికి దిగడంతో 5 వికెట్లకు RCB 221 స్కోరు చేసింది. ఈ మ్యాచ్ తోనే ఈ సీజన్లో అడుగుపెట్టిన బుమ్రా.. పొదుపుగా(4 ఓవర్లలో 29 పరుగులు) బౌలింగ్ చేశాడు.