Phone Stolen : మీ స్మార్ట్‌ఫోన్ పొగొట్టుకున్నారా? మీ ఫోన్లలో ఆన్లైన్ అకౌంట్లు, ఇతర ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. మీ ఫోన్ దొంగిలించిన సమయంలో మీ బ్యాంక్ అకౌంట్లు, ఇమెయిల్ అకౌంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీ ఫోన్ దొంగిలించిన తర్వాత విలువైన డేటాను తస్కరించే ప్రమాదం ఉంటుంది. మీ లాక్ స్క్రీన్ ఓపెన్ చేయగలిగితే మీ ఇమెయిల్ వంటివి ఇప్పటికే లాగిన్ చేసిన అనేక అకౌంట్లను యాక్సెస్ చేయగలరు. అదనంగా, మీ ఫోన్‌కి పంపిన ఏవైనా టెక్స్ట్ మెసేజ్‌లను చూడగలరు. టెక్స్ట్-ఆధారిత టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ కోసం సెటప్ చేసినప్పటికీ, మీ బ్యాంక్ లాగిన్ వంటి ఇతర అకౌంట్లలోని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకునే వీలుంటుంది. అందుకే మీ ఫోన్ పొగొట్టుకుంటే వీలైనంత త్వరగా భద్రతపరమైన చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా మీ ఫోన్ Android మోడల్ లేదా iOS అయితే.. అందులోని రెండు OS సాఫ్ట్వేర్లు ఉంటాయి.. ఆండ్రాయిడ్ ఫోన్లలో Find My Device ఎనేబుల్ చేసుకుని ఉండాలి. అలాగే ఐఫోన్లలో కూడా Find My ఆన్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడానికి మీ ఫోన్‌ను ఆన్ చేసి, ఇంటర్నెట్ కనెక్షన్‌ని కలిగి ఉండాలి. ఈ సెక్యూరిటీ టూల్స్ లొకేషన్ ఆధారంగా మీ ఫోన్ చివరిగా ఎక్కడ కనిపించిందో తెలియజేస్తాయి. సులభంగా కనుగొనడానికి డివైజ్ సౌండ్‌ని ప్లే చేయడానికి అనుమతిస్తాయి. మీకు అది కనిపించకుంటే.. దానికి కాల్ చేయడానికి లేదా టెక్స్ట్ చేసేందుకు ప్రయత్నించండి. మీ ఫోన్ దొంగిలించారని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే ఈ కింది దశలను అనుసరించండి.
మీ ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించండి :
మీ ఫోన్‌ని రిమోట్‌గా ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ అకౌంట్లు, వ్యక్తిగత సమాచారం అనధికార యాక్సెస్ నుంచి రక్షించుకోవచ్చు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ డేటాను తొలగించండి :
మై డివైజ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఒకటి కంటే ఎక్కువ గూగుల్ అకౌంట్లను కలిగి ఉన్నట్లయితే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం ఉపయోగించే ప్రధాన గూగుల్ అకౌంట్లకు లాగిన్ అయ్యారని నిర్థారించుకోండి.
ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఎంచుకోండి.
Enable Lock & Remove ఆప్షన్ ఎంచుకోండి
ఆపై Erase Data ఆప్షన్ క్లిక్ చేయండి.
మీరు మీ ఫోన్ డేటాను తొలగించిన తర్వాత ఎవరూ యాక్సస్ చేయలేరు.
మీ Samsung ఫోన్ డేటాను ఇలా తొలగించండి :
శాంసంగ్ ఫోన్లలో (SmartThings Find) అనే ఆప్షన్‌కు వెళ్లండి.
మీ Samsung అకౌంట్ లేదా గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేయండి.
మీ ఫోన్ మోడల్ ఎంచుకోండి.
Remove Data ఆప్షన్ ఎంచుకోండి.
మీ ఫోన్ డేటా తొలగించిన తర్వాత ఎవరికి అందుబాటులో ఉండదు.
మీ iPhone డేటాను ఇలా తొలగించండి :
iCloud Find డివైజ్ ఆప్షన్ ఎంచుకోండి.
మీ Apple IDతో లాగిన్ చేయండి.
మీ ఫోన్ మోడల్ ఎంచుకోండి.
ఈ డివైజ్ Remove ఆప్షన్ ఎంచుకోండి.
మీ iPhone ఆఫ్‌లైన్‌లో ఉంటే.. మీ ఐఫోన్ ఇంటర్నెట్కి మళ్లీ కనెక్ట్ అయిన వెంటనే ‘రిమూవ్ రిమోట్ డివైజ్’ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
మీ iPhone iOS 15 లేదా తర్వాతి వెర్షన్‌ను కలిగి ఉంటే.. డివైజ్‌లో సౌండ్ ప్లే చేయడానికి డివైజ్‌లను కనుగొనడానికి ఉపయోగించవచ్చు.
మీ ఇమెయిల్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోండి :
మీ ఫోన్ డేటాను రిమూట్గా డిలీట్ చేసినప్పటికీ.. మీ ఫోన్ ద్వారా యాక్సెస్ చేసే అన్ని అకౌంట్లు దొంగల చేతుల్లో ఉండవచ్చని భావించాలి. మీ ఇమెయిల్ అకౌంట్లను ఇతర డివైజ్‌లలో లాగిన్ అవ్వాలి. అకౌంట్ వెరిఫికేషన్ కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్, పాస్వర్డ్ రీస్టోర్ కోసం ఇమెయిల్ ద్వారా ప్రయత్నించవచ్చు. మీ ఇమెయిల్ పాస్వర్డ్ మార్చుకోవడం ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఇతర ముఖ్యమైన అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చండి :
మీ బ్యాంక్ అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, షాపింగ్ యాప్‌లు, ఇతర సర్వీసులతో సహా మీ ఫోన్లో యాక్సెస్ చేసిన ఏవైనా ముఖ్యమైన అకౌంట్ల జాబితాను డౌన్లోడ్ చేసుకోండి. ఆయా వెబ్ సైట్లలో లాగిన్ మీ డేటాను భద్రపర్చుకోండి.
పోలీసులకు రిపోర్టు చేయండి :
పోలీసులు మీ ఫోన్‌ని రికవరీ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, పోలీసులకు రిపోర్టు చేయాలి. దొంగతనాన్ని అధికారికంగా డాక్యుమెంట్ చేయడం అనేది బీమా క్లెయిమ్‌లను పొందడానికి సాయపడతుంది. మీకు దగ్గరలోని పోలీసులను సంప్రదించండి. మీ ఫోన్ తయారీ, మోడల్, సీరియల్ నంబర్, IMEI నంబర్‌ను రిపోర్టులో తెలియజేయండి. మీ వద్ద ఈ సమాచారం లేకుంటే.. మీ ఫోన్ కొనుగోలు చేసినా కంపెనీ లేదా డీలర్‌ను సంపద్రించి వివరాలను పొందండి.
మీ సెల్యూలర్ నెట్వర్క్ క్యారియర్‌కు కంప్లైంట్ చేయండి :
మీ ఫోన్ దొంగిలించారనే విషయాన్ని మీ సెల్యులార్ క్యారియర్‌కు తెలియజేయండి. మోసపూరిత ఛార్జీలు చేయకుండా లేదా ఇతరులను స్కామ్ చేయడానికి మీ ఫోన్‌ని ఉపయోగించకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ నెట్వర్క్ క్యారియర్లు దొంగిలించిన డివైజ్‌లను బ్లాక్‌లిస్ట్ చేస్తారు. భవిష్యత్తులో వాటిని ఇతరులు యాక్టివేట్ చేయకుండా బ్లాక్ చేస్తారు. తద్వారా మీ ఫోన్ ఎవరికి విక్రయించలేరు. కొత్త ఫోన్ కొనుగోలు చేసి మీ ప్రస్తుత ఫోన్ నంబర్ని ఉపయోగించడం కొనసాగించవచ్చు.