భారత్ లోని అత్యంత సంపన్నుల(Super Rich) తీరుపై షాకింగ్ రిపోర్ట్ విడుదలైంది. అల్ట్రా-హై-నెట్-వర్త్-ఇండివిడ్యువల్(UHNWI) కలిగినవారిలో ఎక్కువ మంది విదేశాల్లో స్థిరపడే ఆలోచన చేస్తున్నారని కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సర్వేలో తేలింది. జీవన ప్రమాణాలు, సులభతర వ్యాపారం.. అక్కడ స్థిరపడాలన్న ఆలోచనను తెస్తున్నాయి. విదేశాంగ శాఖ డేటా ప్రకారం ఏటా 25 లక్షల మంది సంపన్నులు దేశం దాటుతున్నారు. అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, UAE వంటి దేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా ప్లాన్ చేస్తున్నారని తేలింది.
భారత పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే ఆతిథ్య దేశాల్లోనూ పర్మినెంట్ సిటిజన్స్ గా ఉండాలనుకుంటున్నారు. 36 నుంచి 40 ఏళ్లున్న వారు, 61 దాటిన వ్యక్తులు ఈ కేటగిరీలో ఉన్నారు. ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని ‘భవిష్యత్తు పెట్టుబడి’గా భావిస్తున్నారు. రూ.25 కోట్ల నుంచి రూ.250 కోట్లు గల వ్యక్తుల్ని UHNWIగా వ్యవహరిస్తారు. అమెరికా EB-5 వీసా, పోర్చుగల్ గోల్డెన్ వీసా, కెనడా స్టార్టప్ వీసా, UAE గోల్డెన్ వీసా ఆకర్షిస్తున్నాయట.
ఇక ట్రంప్ తెచ్చిన గోల్డెన్ వీసాతో నివాసం, పన్ను మినహాయింపు ఉండటంతో అటువైపు దృష్టి పెట్టారు. 2023లో 2,83,000 మంది అత్యంత సంపన్న భారతీయులున్నారు. వీరి మొత్తం సంపద విలువ రూ.283 లక్షల కోట్లు. 2028 నాటికి వీరి సంఖ్య 4,30,000కు చేరనుండగా, ఆనాటికి సంపద రూ.359 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
1 thought on “మిలియనీర్ల చూపు విదేశాల వైపు… Look To Settle Abroad”