మొబైల్, కంప్యూటర్, బ్యాంక్ అకౌంట్స్.. ఇలా మీరు ఏర్పాటు చేసుకున్న పాస్ వర్డ్ భద్రమే(Secure)నని అనుకుంటున్నారా.. కానీ ‘సెమాఫోర్’ సంస్థ ఇచ్చిన నివేదిక చూస్తే అది కష్టమేనని అనుకోవాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 10 బిలియన్ల సీక్రెట్ కోడ్స్(Passwords) లీకయ్యాయని సైబర్ నిపుణులు ‘ఫోర్బ్స్’తో పంచుకున్నట్లు సదరు రిపోర్ట్ తెలిపింది.
వ్యక్తిగతమైనవే…
1,000 కోట్ల వ్యక్తిగత(Individual) పాస్ వర్డ్స్ లీకయ్యాయని ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని ‘సెమాఫోర్’ తెలిపింది. హ్యాకర్లు దొంగిలించిన పాస్ వర్డ్స్ ద్వారా వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి మొత్తం దోచేసే పరిస్థితి ఉందట. ఒక వినియోగదారుడు(User) ఉపయోగించిన పాస్ వర్డ్ ను మరో ఖాతాలోకి జొప్పించి అందులోకి చొరబడే అవకాశముంది.
ఇదెలా అంటే…
ఒక వ్యక్తి ఈ-మెయిల్ నుంచి పాస్వర్డ్ తీసుకుని వారి బ్యాంకు అకౌంట్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఈ టెక్నిక్ ను ఇంతకుముందు ఉపయోగించినట్లు సైబర్ క్రైమ్ నిపుణులు అంటున్నారు. 2020 నుంచి సైబర్ అటాక్ ల సంఖ్య రెండింతలైందని IMF(అంతర్జాతీయ ద్రవ్య నిధి) అంచనా వేసింది. ఈ సైబర్ అటాక్ లు వ్యాపారాలతోపాటు ఆరోగ్య రంగంపైనా ప్రభావం చూపిస్తాయని రిపోర్టులో తెలియజేసింది.