Published 21 Jan 2024
రూ. 20 వేల లోపు ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం వెతుకున్నారా? అయితే, మీకోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్లతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. ప్రత్యేకించి ప్రైమ్ మెంబర్లు తక్కువ ధరకే నచ్చిన ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి డీల్‌ని పొందే అవకాశం ఉంది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఇదే సరైన అవకాశం. ఈ సేల్‌లో మీరు రూ.20 వేల లోపు కొనుగోలు చేయగల టాప్ బెస్ట్(Top Best) స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని ఇప్పుడే కొనేసుకోండి. పూర్తి ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ M34 5G :
శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6000mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా, Exynos 1280 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గెలాక్సీ M34 5G ఫోన్ అమెజాన్‌లో రూ. 16,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. Samsung Galaxy M34 5G ఫోన్ కొనుగోలుపై దృష్టిపెట్టొచ్చు.
రియల్‌మి నోట్ 13 5G :
రియల్‌మి నోట్ 13 5G హ్యాండ్సెట్ ఫోన్ 6.67-అంగుళాల FHD+ పోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కలిగి ఉంది. రెడ్మి నోట్ 13 5G ఫోన్ మోడల్ 16MP ఫ్రంట్ కెమెరాతోపాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ మొబైల్ రూ.17,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
రియల్‌మి నార్జో 60 5G ఫోన్ :
రియల్‌మి నార్జో 60 5G ఫోన్ 6.43-అంగుళాల 90Hz సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరాతోపాటు 16MP ఫ్రంట్ కెమెరా పనిచేస్తుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో నడుస్తుండగా, MediaTek Dimensity 6020 5G చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. (Realme Narzo 60 5G) రూ.15,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ 6.72-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. 108ఎంపీ బ్యాక్ కెమెరా సహా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో… క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ (OnePlus Nord CE 3 Lite 5G) స్మార్ట్‌ఫోన్ రూ.18,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
ఈ మొబైల్ ఫోన్లన్నీ సామాన్యులకు అందుబాటులో ఉంటూనే మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. రూ.20,000 లోపు స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవారికి మార్కెట్లో ప్రస్తుతం తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. మొన్నటి సంక్రాంతి పండుగ నుంచి రిపబ్లిక్ డే వేడుకల వరకు ఈ ఆఫర్ కొనసాగనుందని అమెజాన్ ప్రకటించింది.