సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించట్లేదంటూ నిషేధం విధించింది నేపాల్(Nepal) సర్కారు. ‘ఫేస్ బుక్’, ‘X’, యూట్యూబ్ సహా 12 సంస్థలను బ్లాక్ చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ ప్రకటించారు. పారదర్శకత, బాధ్యతాయుత జవాబుదారీతనం కోసం పార్లమెంటులో బిల్లు తెచ్చింది. ఆ మేరకు లైజనింగ్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ ప్రతి సంస్థకు ఇప్పటికే నోటీసులిచ్చింది. టిక్ టాక్ సహా 3 సంస్థలు స్పందించగా, మిగతావి పట్టించుకోలేదు. ఆగ్రహించిన సర్కారు వాటిని బ్లాక్ చేసింది.