అల్పాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన దేవరకొండ(Devarakonda) ST బాలికల గురుకులంలో జరిగింది. పొద్దున అల్పాహారం(Breakfast) తిన్న కొద్దిసేపటికే ఇబ్బంది పడ్డారు. బాధిత పిల్లలందర్నీ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. నిన్న రాత్రి చికెన్, ఈరోజు ఉదయం పులిహోర తిన్నారు. కడుపునొప్పి భరించలేక విద్యార్థినులంతా విలవిల్లాడారు. గతేడాది నవంబరులో నారాయణపేట జిల్లా మాగనూరు ZP హైస్కూల్లో వారం వ్యవధిలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు హైకోర్టు సీరియస్ అవడంతో ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఆదేశాలున్నా.. మళ్లీ పిల్లలు అవస్థల పాలయ్యారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి: https://justpostnews.com