పెళ్లి వివాదాల కేసుల్లో పిల్లల కస్టడీపై తీర్పులు కఠినంగా ఉండొద్దని, వాటిని మార్చొచ్చంటూ సుప్రీం స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే… 2011లో పెళ్లి చేసుకున్న జంట 2012లో బాబు పుట్టాక 11 నెలలకు విడిపోయింది. చిన్నారి కస్టడీని తల్లికి ఇచ్చాక తండ్రి ఇక పట్టించుకోలేదు. ఆ తల్లి 2016లో ఇంకో వ్యక్తిని మనువాడి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ రెండో భర్తకూ ఇది రెండో పెళ్లి కాగా.. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. రెండో భర్త పిల్లలతో మలేషియా వెళ్లేందుకామె కొన్ని పత్రాల కోసం మొదటి భర్తను సంప్రదించింది. https://justpostnews.com
ఆ టైంలో తన బిడ్డను హిందూ మతం నుంచి క్రైస్తవానికి మార్చారని ఆ తండ్రి గుర్తించాడు. ఫ్యామిలీ కోర్టులో కేసు వేస్తే అతనికి వ్యతిరేకంగా తీర్పు రాగా, హైకోర్టులో సవాల్ చేశాడు. హైకోర్టు ఆయన్ను సమర్థించగా, సదరు తల్లి సుప్రీంను ఆశ్రయిస్తే అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. కానీ వేరు చేయడం వల్ల బాబు ఆరోగ్యం దెబ్బతింటుందన్న సైకాలజిస్ట్ రిపోర్టును పరిగణలోకి తీసుకుంది. తన తీర్పును సమీక్షించి 12 ఏళ్ల బాలుణ్ని తండ్రికి అప్పగించడాన్ని రద్దు చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నబి.వరాలే బెంచ్ ఈ తీర్పునిచ్చింది.