టీసీఎస్(TCS)… ఈ పేరు చెబితేనే ఐటీ(Information Technology) రంగంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు తెలిసిపోతాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా కొనసాగుతూ భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ అత్యున్నత విలువలతో సాగుతున్న కంపెనీ ఇది. టాటా కంపెనీలో భాగమైన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పని విధానం, ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు వంటి అంశాల్లో ప్రపంచంలోనే టాప్ లో నిలిచింది ఈ కంపెనీ. ‘గ్లోబల్ టాప్ ఎంప్లాయర్స్’గా ఎంపికై మరోసారి తన స్థానాన్ని ప్రపంచానికి తెలియజేసింది.
వరల్డ్ టాప్ గా…
టాప్ ఎంప్లాయర్స్ ఇన్ స్టిట్యూట్ గా TCS.. వరల్డ్ లోనే టాప్ 16 కంపెనీల లిస్టులో నిలిచింది. వివిధ రీజియన్లు, 32 దేశాల పరిధిలో చేపట్టిన గ్లోబల్ సర్టిఫికేషన్ లో ఈ టాటా దిగ్గజం.. అగ్రగామి(The Best)గా పేరు సంపాదించింది. 55 దేశాలకు విస్తరించి 153 దేశాలకు చెందిన వ్యక్తులు సహా మొత్తం 6,03,305 మంది ఉద్యోగుల(2023 డిసెంబరు 31 నాటికి)తో కొనసాగుతుండగా.. అందులో 35.7% మంది మహిళా ఉద్యోగులకు స్థానం కల్పించింది. యూరప్, UK, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా(South East) రీజియన్లలో ఈ సర్వే నిర్వహించారు.
ఇవే ప్రామాణికం…
ఆరు సిద్ధాంతాలు, 20 అంశాల ఆధారంగా HR(Human Resource) అందించిన సేవల్ని ప్రామాణికంగా తీసుకుని ఈ గుర్తింపును కేటాయించారు. పని వాతావరణం(Work Environment), వైవిధ్య నియామకాలు, టాలెంట్ అక్విజిషన్, పీపుల్ స్ట్రాటెజీ, సంక్షేమం(Well-being), నేర్చుకునే విధానం(Learning) అంశాల ప్రాతిపదికగా అన్ని కంపెనీల పనితీరును లెక్కగట్టారు. ఎంప్లాయీస్ కు సంబంధించి హెల్త్-వెల్నెస్ విభాగంలోనైతే ప్రపంచంలోనే సెకండ్ ర్యాంకును TCS దక్కించుకుంది. AI(Artificial Intelligence)లో గతేడాది 2.05 లక్షల మంది ఉద్యోగులు శిక్షణ పొందడం, 72 వేల మంది మాస్టర్ డిగ్రీ సాధించడాన్ని బట్టి సంస్థ ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తుందో తెలుస్తున్నదని సర్వే అభిప్రాయపడింది.
ఖుషీ ఖుషీ…
తమకు దక్కిన గుర్తింపు పట్ల TCS HR ఆఫీసర్ మిలింద్ లక్కడ్ సంతోషం వ్యక్తం చేశారు. టాలెంట్ ఎంగేజ్మెంట్-ట్రాన్స్ఫర్మేషన్(Transformation) విధానంతో ప్రపంచంలోని అన్ని చోట్లా తమ కంపెనీ విధులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎంప్లాయర్ బ్రాండ్ అనేది TCSకు ఆభరణం వంటిదన్న లక్కడ్.. తమ పట్ల వినియోగదారుల(Customers)కు ఉన్న విశ్వాసాన్ని ఇలాగే కొనసాగిస్తామన్నారు.