సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూభారతి చట్టం ప్రకారం క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు గల దరఖాస్తుల క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులరైజేషన్ కోసం మొత్తం 9.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఒక చిన్న, సన్నకారు రైతు 2024 జూన్ 2కు ముందు రిజిస్టర్డ్ పత్రం ద్వారా కాకుండా బదిలీ ద్వారా వ్యవసాయ భూమిపై హక్కులు పొంది, 12 ఏళ్లకుపైగా స్వాధీనంలో ఉన్నట్లు రుజువు చేస్తే దరఖాస్తులు ప్రాసెస్ చేసేలా నోటిఫికేషన్ జారీ అయింది.