రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ భేటీపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తీవ్ర ఆవేదన చెందారు. ఒక ప్రపంచ క్రిమినల్ ప్రజాస్వామ్య(Democracy) దేశాధినేత ఆలింగనం(Hug) చేసుకోవడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
రెండ్రోజుల పర్యటనలో మోదీ రష్యా చేరిన రోజే ఉక్రెయిన్ పిల్లల హాస్పిటల్ పై దాడి జరిగి 37 మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. కీవ్ లో హాస్పిటల్ పై దాడి జరిగిన ఫొటోలను ‘X’లో పంచుకున్న జెలెన్ స్కీ.. మోదీ టూర్ పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ దాడిలో 100 భవనాలు, స్కూల్, మెటర్నిటీ హాస్పిటల్ నేలమట్టమయ్యాయి(Collapsed).