ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్ల(Users)ను కలిగి ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ల(Versions)ను తీసుకువచ్చే మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2 బిలియన్ల(200 కోట్ల) మంది యూజర్లు కలిగిన వాట్సాప్.. 33 రకాల మొబైళ్ల మోడల్స్ ను నిషేధించబోతున్నది. దీంతో రానున్న రోజుల్లో ఈ 33 రకాల మోడళ్లలో వాట్సాప్ నిలిచిపోనుందన్నమాట.
క్యానల్టెక్(CanalTech) అనే సంస్థ రిపోర్ట్ ప్రకారం ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడళ్లలోనూ పాత తరానికి ఇక వాట్సాప్ కాలం చెల్లబోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మెటా యాజమాన్యం చేపట్టే అప్డేట్ ద్వారా సేవలు నిలిచిపోతాయి. ఆపిల్, శాంసంగ్, సోనీ, ఎల్.జి. వంటి కంపెనీల ఫోన్లు ఇందులో ఉన్నాయి.
వాట్సాప్ బంద్ అయ్యే కంపెనీల మోడళ్లు ఇవే…
కంపెనీ | మోడల్ |
శాంసంగ్(Samsung) | గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్ ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ S3 మినీ, గెలాక్సీ S4 ఆక్టివ్, గెలాక్సీ S4 మినీ, గెలాక్సీ S4 జూమ్ |
ఆపిల్(Apple) | ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6S, ఐఫోన్ 6S ప్లస్, ఐఫోన్ SE |
హువావె(Huawei) | అసెండ్(Assend) P6 S, అసెండ్(Assend) G525, C199, GX1s, Y625 |
ఎల్.జి.(LG) | ఆప్టిమస్(Optimus) 4x HD, ఆప్టిమస్ G, ఆప్టిమస్ G Pro, ఆప్టిమస్ L7 |
సోనీ(Sony) ఎక్స్ పీరియా Z1, ఎక్స్ పీరియా E3, ఎక్స్ పీరియా M | ఎక్స్ పీరియా Z1, ఎక్స్ పీరియా E3, ఎక్స్ పీరియా M |
లెనోవొ(Lenovo) | 46600, A858T, P70, S890, A820 |
మోటరోలా(Motorola) | మోటో G, మోటో X |