
వ్యాపార సంస్థల సీఈవోలు, అకౌంటెంట్లే లక్ష్యంగా కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. సంస్థల అధికారిక మెయిల్స్ కు హానికర ఫిషింగ్ లింక్స్ పంపి సిస్టమ్స్ పై రిమోట్ యాక్సెస్ పొందుతారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వాట్సాప్ వెబ్ ద్వారా అకౌంట్లను తప్పుదారి పట్టించే మెసేజ్ లు పంపిస్తూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సీఈవోల నంబర్ల నుంచే అకౌంటెంట్ల ఫోన్లకు మెసేజ్ లు రావడంతో బాసే కదా అని డబ్బు పంపుతున్నారు.