Published 23 Jan 2024
Block Admins On WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూజర్ల(Users)ను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అలాంటి జనాదరణకు సరిపోయే మెసేజింగ్ అప్లికేషన్ ఏదీ లేదనే చెప్పాలి. మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులను చూసింది. వాట్సాప్ కొత్త ఛానెల్‌లను ప్రవేశపెట్టింది. యూజర్లు తమకు ఇష్టమైన అంశాల గురించి అప్డేట్గా ఉండటానికి ఇది వీలు కల్పిస్తుంది. వ్యక్తిగత చాట్ల కోసం మాత్రమే కాకుండా వాట్సాప్ గ్రూపుల(Groups) కోసం కూడా మెటా అనేక భద్రతా ఫీచర్లు, ప్రైవసీ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. అందులో గ్రూప్ అడ్మిన్లను బ్లాక్ చేయడం ముఖ్యమైన ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు.
అడ్మిన్ లే లీడర్లు…
సాధారణంగా వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్లను లీడర్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రూపులో పాల్గొనేవారిని యాడ్ చేయడం లేదా తొలగించడం మాత్రమే వారికి హక్కు ఉంటుంది. కానీ సాధారణ సభ్యులు గ్రూప్ నుంచి నిష్క్రమించకుండా.. ఎవరైనా అడ్మిన్లను బ్లాక్ చేయాలనుకుంటే వారు ఇప్పుడు సులభంగా చేయవచ్చు. అయితే గుర్తుతెలియని వ్యక్తులకు, ఫోన్ కాంటాక్టులకు యాడ్ చేసిన వారికి పద్ధతి భిన్నంగా ఉంటుంది. మీ ఫోన్ బుక్‌లో నంబర్ అందుబాటులో లేని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ని Android లేదా iOS యూజర్లు బ్లాక్ చేయాలనుకుంటే ఈ దశలను తప్పనిసరిగా అనుసరించాలి.
గ్రూపు అడ్మిన్లను బ్లాక్ చేయాలంటే? :
- నిర్దిష్ట వాట్సాప్ గ్రూప్ చాట్‌కి వెళ్లండి.
- గ్రూప్ పేరు మీద నొక్కండి లేదా క్లిక్ చేయండి.
- గ్రూపు సభ్యుల జాబితాను సందర్శించండి. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న అడ్మిన్ పేరును కనుగొనండి.
- పాప్-అప్ విండో నుంచి మెసేజ్ (ఫోన్ నంబర్)పై క్లిక్ చేయండి.
- అడ్మిన్‌తో వ్యక్తిగత ఛాట్బాక్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఛాట్ స్క్రీన్ పైభాగంలో కనిపించే నంబర్‌పై క్లిక్ చేయండి.
- పైకి స్క్రోల్ చేయండి. ‘Block’ ఆప్షన్ కనిపిస్తుంది.
- అడ్మిన్‌ని బ్లాక్ చేసేందుకు ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నట్లయితే అదే విధంగా ఉండదని గమనించాలి. ఈ సందర్భంలో వాట్సాప్ అప్లికేషన్ల ఇంటర్ఫేస్ తేడాల కారణంగా Android, iOS యూజర్లు ప్రత్యేక పద్ధతులను అనుసరించాలి.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం :
- వాట్సాప్ ఓపెన్ చేసి త్రీ డాట్స్ మెను నుంచి ‘More Options’కు వెళ్లండి.
- సెట్టింగ్‌లు (Settings) ఖాతా (Account)పై నొక్కండి.
- ఆ తర్వాతి పేజీలో ‘Privacy’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- ప్రైవసీ కింద బ్లాక్ చేసిన కాంటాక్టులకు వెళ్లండి.
- ‘+’ గుర్తుపై క్లిక్ చేయండి.
- మీ ఫోన్లో సేవ్ చేసిన అడ్మిన్ పేరును ట్యాప్ చేయండి.
iOS యూజర్ల కోసం :
- వాట్సాప్‌లో Settings ఓపెన్ చేయండి.
- ‘Privacy’ ఎంపికకు వెళ్లి ‘Blocked’ ఆప్షన్ నొక్కండి.
- ‘Add New’ పై క్లిక్ చేయండి.
- కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నట్టుగానే అడ్మిన్ పేరులో మార్చుకోవచ్చు.
మీ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించే యూజర్లు కూడా ఆండ్రాయిడ్ యూజర్ల మాదిరిగానే ఈ దశలను అనుసరించవచ్చు. తద్వారా గ్రూపు అడ్మిన్లను సులభంగా బ్లాక్ చేయొచ్చు. మీరు కూడా ఓసారి ప్రయత్నించండి. మీకు నచ్చిన గ్రూపు అడ్మిన్లను పై విధంగా బ్లాక్ చేసుకోవచ్చు.